Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సురవరం భామ స్టన్నింగ్ పోజు

By:  Tupaki Desk   |   29 Dec 2019 11:13 AM GMT
ఫోటో స్టోరీ: సురవరం భామ స్టన్నింగ్ పోజు
X
'అందాల రాక్షసి' తో తెలుగు తెరకు పరిచయం అయింది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా సూపర్ హిట్టేమీ కాలేదు కానీ లావణ్య త్రిపాఠికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత 'భలే భలే మగాడివోయ్' లాంటి మంచి హిట్లు రావడంతో ఒక దశలో టాప్ హీరోయిన్ లీగ్ లోకి చేరుతుందని చాలామంది అనుకున్నారు. అందుకేనేమో పక్కంటి అమ్మాయి ఇమేజ్ ని వదిలించుకునేందుకు గ్లామర్ గేర్లు కూడా వేసింది. అయితే ఈమధ్య వరసగా అరడజను ఫ్లాపులతో డీలా పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన 'అర్జున్ సురవరం' హిట్ కావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది.

అయితే ఈ సమయంలో రెస్ట్ తీసుకుంటే కొత్త ఆఫర్లు రావడం కష్టమైపోతుంది కదా? పెనం వేడిమీద ఉన్నప్పుడే దోశ పిండి పొయ్యాలనే మాసు సామెతను చక్కగా ఆర్థం చేసుకునే ఇన్స్టాగ్రామ్ లో తన వేడి అందాలను వడ్డిస్తోంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "నా బ్యాక్ దాన్ని పట్టుకోమని.. 'అంతా సవ్యంగా జరుగుతుంది' అని చెప్పింది" అంటూ బ్రమ్మి వేదాంతం చెప్పింది. అక్కడ బ్యాక్ ఏంటో.. దేన్ని పట్టుకోవాలో మీకు అర్థం అయినంత పట్టుకోండి.. మనసులో పెట్టుకోండి. అర్థం అయితే సరే.. అర్థం కాకపోతే న్యూ ఇయర్ మూడ్ కదా అని సరిపెట్టుకోండి. ఇక ఫోటో విషయానికి వస్తే బ్లాక్ టీ షర్టు.. డెనిమ్ మిడ్డీ ధరించి.. నడుముపై చేతులు పెట్టుకుని గోడకు బ్యాకును ఆన్చి ముందుకు వంగి చిరునవ్వులు చిందిస్తోంది. స్టైల్ గా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఒక లైక్ వేసుకున్నాడు. "మిస్ పర్ఫెక్ట్".. "సూపర్ హాట్".. "బ్యూటీ క్వీన్" అంటూ కొందరు సాధారణ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. సినిమాల విషయానికి వస్తే లావణ్య ప్రస్తుతం 'A1 ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది.