Begin typing your search above and press return to search.
అందాల రాక్షసి గట్టి బ్రాండే పట్టింది
By: Tupaki Desk | 7 July 2021 3:37 AM GMTఈమద్య కాలంలో స్టార్స్ కు రెండు చేతుల సంపాదన. ఎంత క్రేజ్ ఉంటే అంత సంపాదన అన్నట్లుగా పరిస్థితి ఉంది. చిన్న చిన్న కంపెనీల నుండి అంతర్జాతీయ స్థాయి కంపెనీల వరకు ఆయ కంపెనీల రేంజ్ ను బట్టి స్టార్స్ ను ఎంపిక చేసుకుని తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. కొందరు హీరోయిన్స్ సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా కూడా ఈ ప్రమోషనల్ హోర్డింగ్స్ మరియు కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తున్నారు. ఫేమ్ ఉన్నా లేకున్నా ఏదో ఒక కమర్షియల్ లో కనిపించే అవకాశాలు వస్తున్నాయి. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కెరీర్ లో నిలకడగా సాఫీగా ముందుకు సాగుతుంది.
పెద్ద ఎత్తున సక్సెస్ లు అందుకోలేక పోయినా కూడా మొదటి సినిమా ఇప్పటి వరకు కెరీర్ ను నెట్టుకుంటూ అయితే రావడంలో సక్సెస్ అయ్యింది. ఈ అమ్మడు తెలుగుతో పాటు సౌత్ లోని ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపును అయితే దక్కించుకుంది. అందుకే ఈమెకు ఒక మంచి కమర్షియల్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. కన్నడ స్టార్ పునీత్ లతో పాటు ఇంకా పలువురు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించిన గోల్డ్ విన్నర్ కు ఇప్పుడు ఈమె రంగంలోకి దిగబోతుంది. గోల్డ్ విన్నర్ ఆయిల్ కంపెనీ వారు లావణ్య త్రిపాఠితో ఏడాదికి గాను ఒప్పందం చేసుకున్నారట.
ఇటీవలే చెన్నైలో సదరు బ్రాండ్ కు కమర్షియల్ యాడ్ ను కూడా ప్రముఖ యాడ్ డైరెక్టర్ చిత్రీకరించాడట. అతి త్వరలోనే ఆ కమర్షియల్ యాడ్ బుల్లి తెరపై సందడి చేయబోతుంది. తెలుగు మరియు తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా లావణ్య నటించిన యాడ్ ప్రసారం కాబోతుంది. సినిమాల పరంగా కాస్త నిరుత్సాహం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఆమెకు వస్తున్న ఆఫర్ల విషయంలో మాత్రం చాలా సంతృప్తిగానే ఆమె ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కమర్షియల్ సక్సెస్ లు దక్కించుకోకున్నా కూడా తన అందంకు మరియు నటకు పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకోవడంలో సఫలం అయ్యింది.
ముందు ముందు అయినా ఈ అమ్మడు కమర్షియల్ సక్సెస్ లను దక్కించుకుంటుందేమో చూడాలి. అందాల రాక్షసి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ఈమె ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పెద్ద హీరోల సరసన ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడికి ఆ ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఈమె ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అతి త్వరలోనే అవి పట్టాలెక్కే అవకాశం ఉంది.
సినిమాలు మాత్రమే కాకుండా ఈమెకు వెబ్ సిరీస్ ల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. క్యూట్ గా ఒక పద్దతైన అమ్మాయిగా కనిపించే లావణ్య త్రిపాఠి అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా వెనక్కు తగ్గదు. ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల వింధు చేస్తూనే ఉంటుంది.