Begin typing your search above and press return to search.
హిట్లు రాకపోయినా యాడ్స్ వస్తున్నాయ్
By: Tupaki Desk | 4 Oct 2017 7:01 AM GMTహీరోయిన్ లావణ్య త్రిపాఠి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ప్రారంభమైనా ఇప్పుడు కాసింత డల్ ఫేజ్ నడుస్తోంది. గతేడాది అంతా వరుస హిట్స్ తో సత్తా చాటిన ఈ భామ.. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా ఫ్లాపులనే ఫేస్ చేయాల్సి వస్తోంది. వరుణ్ తేజ్ తో నటించిన మిస్టర్.. శర్వానంద్ తో నటించిన రాధ.. నాగచైతన్యతో చేసిన యుద్ధం శరణం చిత్రాలు ఈ అందాల రాక్షసికి నిరాశనే మిగిల్చాయి.
అన్నీ క్రేజీ ప్రాజెక్టులే అయినా.. కంటిన్యూగా ఫ్లాప్స్ చేయాల్సి రావడం నిజంగా లావణ్య బ్యాడ్ లక్ అనాల్సిందే. అయితే.. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అమ్మడి క్రేజ్ మాత్రం కాసింత కూడా తగ్గడం లేదు. ఇందుకు కారణం.. ఈ అమ్మడు లుక్ విషయంలో పక్కా తెలుగు అమ్మాయి అనదగ్గ స్థాయిలో ఉండడమే. అందుకే రీసెంట్ గా ఓ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా లావణ్య త్రిపాఠినే ఎంచుకున్నారు. ఇప్పటికే యాడ్ షూటింగ్ పూర్తయిపోగా.. తనపై పిక్చరైజ్ చేసిన ఈ యాడ్ ను లావణ్య స్వయంగా షేర్ చేసింది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ను తాను ఎంతో విశ్వసిస్తానని.. అందుకే ఈ యాడ్ లో నటించానని చెబుతోంది లావణ్య త్రిపాఠి.
కంటెంట్.. కాన్సెప్ట్ కూడా తెలుగుదనంతో నిండిపోవడంతో.. లావణ్య త్రిపాఠి ఈ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ ప్రచారానికి సరైన ఆప్షన్ అనిపించకమానదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఉన్నది ఒకటే జిందగీ అంటూ హీరో రామ్ తో పాటు ఆడియన్స్ ను పలకరించనుంది లావణ్య. వివి వినాయక్ దర్శకత్వంలో సాయిధరం తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీలో కూడా లావణ్యనే లీడ్ హీరోయిన్ కావడం విశేషం.