Begin typing your search above and press return to search.

క‌న్ను గీటి క‌వ్విస్తే ఛాన్సులిస్తారా ఏం?

By:  Tupaki Desk   |   7 March 2020 6:30 PM GMT
క‌న్ను గీటి క‌వ్విస్తే ఛాన్సులిస్తారా ఏం?
X
లావ‌ణ్య త్రిపాఠి.. అందాల రాక్ష‌సిగా సుప‌రిచితం. సోగ్గాడే చిన్నినాయ‌నా త‌ర్వాత మ‌ళ్లీ అర్జున్ సుర‌వ‌రం చిత్రంతో మంచి హిట్ కొట్టింది. అయినా కానీ లావ‌ణ్య‌కు ప్ర‌త్యేకించి ద‌క్కిన గుర్తింపేమీ లేదు. కార‌ణం ఏదైనా ఈ ఏడెనిమిదేళ్ల కెరీర్ లో లావ‌ణ్య తెలుగు పరిశ్ర‌మ‌లో సాధించిందేమీ లేదు. అడ‌పాద‌డ‌పా యువ‌తరం హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ అలా అలా బండిని నెట్టుకొచ్చేస్తోంది మిన‌హా అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకోలేక‌పోయింది. ఇటీవ‌ల అస‌లు ఈ అమ్మ‌డిని పట్టించుకునే నాధుడే లేడనే గుసగుసలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఆ క్ర‌మంలోనే రొటీనిటీ నుంచి బ‌య‌ట‌ప‌డిన లావ‌ణ్య హ‌ద్దు మీరి వీలున్నంత‌వ‌ర‌కూ అందాలను ప్రదర్శిస్తూ ఫోటో షూట్ లు చేస్తోంది. ఇవి సోషల్‌ మీడియాలో జోరుగానే హల్ చల్‌ చేస్తున్నాయి. ఇంత‌కుముందు అదిరిపోయే క్లీవేజ్ షోతో మ‌త్తెక్కించిన లావ‌ణ్య తాపీగా ఇదిగో ఇలా మ‌రో అదిరిపోయే వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో కొంటెగా క‌న్ను గీటి కుర్ర‌కారుకు వ‌ల వేస్తోంది. అయితే మ‌రీ ఇంత‌గా కొంటెత‌నం ప్ర‌ద‌ర్శించినా తెలుగులో అవ‌కాశాలిచ్చేవాళ్లు అయితే లేరు.

అర్జున్ సుర‌వ‌రం త‌ర్వాత లావ‌ణ్య‌కు నిఖిల్ మ‌రో ఛాన్స్ ఏమైనా ఇస్తున్నాడా? అన్న‌ది తేల‌డం లేదు. ఇటీవ‌లే తమిళంలో వాల్మీకి ఫేం అధర్వ మురళీ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా లావణ్య శుక్రవారం ప్రకటించింది. అలాగే సందీప్ కిష‌న్ స‌ర‌స‌న `ఏ1 ఎక్స్ ప్రెస్‌` చితంలో హాకీ ప్లేయర్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. లావ‌ణ్య లైన‌ప్ చూస్తే ఇప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ రేంజుకు ఎద‌గ‌డం మాత్రం క‌ష్ట‌మే.

వీడియో కోసం క్లిక్ చేయండి