Begin typing your search above and press return to search.

లిప్పులాకులకు నో అంటున్న రాక్షసి

By:  Tupaki Desk   |   27 May 2020 5:30 PM GMT
లిప్పులాకులకు నో అంటున్న రాక్షసి
X
సమయం అనుకూలంగా లేనప్పుడు సర్దుకుపోవాలని చెప్తుంటారు. ఎందుకంటే అసలే అనుకూలంగా లేని టైమ్ కాస్తా మరింత ప్రతికూలంగా మారుతుంది. ఈమధ్య అందాల రాక్షసి అని అందరిచేత అనిపించుకునే లావణ్య త్రిపాఠి ఫిలిం మేకర్లకు కొన్ని కండిషన్లు పెడుతోందట. అందులో ఒకటి ఇంటిమేట్ సీన్లు.. ముద్దు సీన్లు చెయ్యదట. కారణం ఏంటంటే మహమ్మారి.

ఈ కాలంలో ఆ ముద్దుల విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే మూతులలో మూతులు పెట్టడానికి ఎవరికి ధైర్యం ఉంది కనుక? పెద్ద పెద్ద స్టార్లే బయటకు రావాలంటే వణికిపోతున్నారు.. వద్దన్నా జనాలు బీకామ్ గా భౌతిక దూరాలు.. రొమాంటిక్ డిస్టెన్సులు పాటిస్తారు. ఇలాంటి సమయంలో నో ముద్దు అని చెప్పినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. అసలే లావణ్యకు పెద్దగా ఆఫర్లు లేవు.. స్టార్ హీరోల సినిమాలకు పరిశీలించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో కొత్త కొత్త కండిషన్లు పెట్టి ఆఫర్లు ఇవ్వబోయేవారిని కూడా బెదరగొట్టడం ఎందుకని ఫిలిం నగర్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక లావణ్య ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయం మాట్లాడుకుంటే ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'A1 ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. టైటిల్ A1 గా ఉంది కాబట్టి కంటెంట్ కూడా A1 గా ఉంటుందేమో.. ఈ సినిమా హిట్ అయితే లావణ్యకు మంచి ఆఫర్లే వస్తాయి అయితే నో మూతి ముద్దులు.