Begin typing your search above and press return to search.
అంత బిజీ అయితే ఇంత సైలెన్స్ అవసరమా లావణ్య?
By: Tupaki Desk | 12 Nov 2022 2:30 AM GMT'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఉత్తరాది భామ లావణ్య త్రిపాఠి.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తనదైన అందం, నటనతో కట్టిపడేసింది. అలాగే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత లావణ్య త్రిపాఠికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్నినాయనా' లాంటి హిట్ సినిమాల్లో నటించింది.
కానీ, గత కొన్నేళ్ల నుంచి కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా ఈ అమ్మడు వరుస ఫ్లాపుల ఊబిలో చిక్కుకుపోయింది. లావణ్య నుంచి చివరగా వచ్చిన 'హ్యాపీ బర్త్‌డే' సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. చేసిన ప్రతి సినిమా బోల్తా కొట్టడంతో లావణ్య కెరీర్ క్లోజ్ అని అందరూ భావించారు. పైగా 'హ్యాపీ బర్త్‌డే' తర్వాత ఆమె నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు.
దాంతో లావణ్య ఇక సినిమాలకు ప్యాకప్ చెప్పేసిందని ప్రచారం జరిగింది. కానీ, నిజానికి లావణ్య వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోందట. తెలుగులో కోన వెంకట్ దర్శకత్వంలో 'పులి మేక' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోందట. జీ 5 వారు తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
అలాగే తమిళంలో హీరో అధర్వ కు జోడిగా ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ సైతం దాదాపు చివరి దశకు చేరుకుంది. అలాగే మరోవైపు మంజునాథ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లో లావణ్య నటిస్తోంది. ఇవి కాకుండా మరో రెండు కొత్త ప్రాజెక్టులను కూడా ఆమె లైన్ లో పెట్టిందట.
అయితే ఇంత బిజీగా ఉన్న లావణ్య ఆయా ప్రాజెక్ట్స్ కు సంబంధించిన వివరాలు బయటకు వెల్లడించకుండా సైలెన్స్ ను మెయింటైన్ చేస్తుంది. ఈ క్రమంలోనే అంత బిజీ అయితే ఇంత సైలెన్స్ అవసరమా లావణ్య అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలే కెరీర్ క్లోజ్ అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో చేస్తున్న ప్రాజెక్ట్‌లను బయటకు ప్రకటించకుండా సైలెన్స్ ను కొనసాగిస్తే ఇంకా రిస్క్ లో పడే అవకాశాలు ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చేస్తున్న ప్రాజెక్ట్ లను షూటింగ్ పూర్తి అయ్యాక లేదా విడుదలకు ముందు ప్రకటించే కంటే.. సోషల్ మీడియా వేదికగా కాస్త ముందే అనౌన్స్ చేస్తే మంచి బజ్ క్రియేట్ అవుతుందని లావణ్య కు సూచనలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా లావణ్య నోరు విప్పుతుందా..? లేదా..? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.