Begin typing your search above and press return to search.
ఆ పొరపాటే అందాల రాక్షసికి ఆఫర్లు లేకుండా చేసిందా?
By: Tupaki Desk | 30 May 2022 5:29 AM GMTలావణ్య త్రిపాఠి.. ఈమె గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించిన ఈ బ్యూటీ.. చదువు అనంతరం మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ను అందుకుంది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో వచ్చిన 'అందాల రాక్షసి' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 2012 లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తొలి సినిమా అయినప్పటికీ.. లావణ్య నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
అలాగే తన అందం, అభినయం, క్యూట్ నెస్ తో కుర్రకారు గుండెల్లో 'అందాల రాక్షసి'గా ముద్ర వేయించుకుంది. ఆపై వరుస సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠి.. స్టార్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా, అర్జున్ సురవరం, శ్రీరస్తు శుభమస్తు వంటి హిట్లు పడినా.. ఆమె నటించిన చిత్రాల్లో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈమె చివరిగా 'చావు కబురు చల్లగా', 'ఏ1 ఎక్సప్రెస్'లతో పలకరించింది.
ఈ రెండు చిత్రాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యాయి. దీంతో లావణ్యను టాలీవుడ్ దర్శకనిర్మాతలు పట్టించుకోవడమే మానేశారు. ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి.
టాప్ హీరోలే కాదు.. టైర్ 2 హీరోలు సైతం ఆమెవైపు చూడటం లేదట. అయితే రొటీన్ కథలు, పాత్రలను ఎంచుకోవడమే లావణ్య చేసే పొరపాటని, అందుకే వరుస ఫ్లాపులు పడుతున్నాయని, దాంతో ఆఫర్లు కూడా తగ్గిపోయాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.
సరైన కథలను ఎంపిక చేసుకుని ఉండుంటే.. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా కొనసాగేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రస్తుతం లావణ్య తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. అదే 'హ్యాపీ బర్త్‌డే'. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యలమంచిలి సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.
ఇందులో నరేష్ ఆగస్త్య, వెన్నెల కిశోర్, సత్య ప్రధాన పాత్రలను పోషిస్తుండగా.. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. ఈ సినిమా అయిన మంచి విజయం సాధిస్తే.. లావణ్య సినీ కెరీర్ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి.