Begin typing your search above and press return to search.

ఎక్కడ మాట్లాడుతున్నారు లావణ్య?

By:  Tupaki Desk   |   24 July 2016 9:37 AM GMT
ఎక్కడ మాట్లాడుతున్నారు లావణ్య?
X
మొన్నటి వరకు కేవలం సినిమా న్యూసులు మాత్రమే పి.ఆర్. ఏజన్సీలు పంపేవి. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ల దగ్గరనుండి కూడా ఇలాంటి ప్రెస్ నోట్లు వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన ఒక నోట్.. ''ఇప్పుడు అందరూ నా స్టయిల్‌ గురించి మాట్లాడుతున్నారు'' అంటూ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పంపించిన నోట్. భలే ఉంది కదూ.

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో ఒక రకం స్టయిల్లో కనపించిన లావణ్య.. ఇప్పుడు 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలో మరో స్టయిల్లో కనిపిస్తోందట. ఎక్కడికి వెళ్ళినా కూడా వావ్ ఆ సినిమాలో స్టయిలింగ్ అదరగొట్టేశావ్ అంటూ అందరూ పొగిడేస్తున్నారు అని చెప్పుకొచ్చింది లావణ్య. అసలు ఈ కొత్త సినిమా ఇంకా రిలీజే కాలేదు. బయటకొచ్చింది ఒక పాట మాత్రమే. ఆ పాటలో లావణ్యను చూస్తే నిజంగా అంత చించేసినట్లు కనిపించట్లేదు. పోనివ్‌ బయట ఈవెంట్లలో సమంత టైపులో ఈవిడ ఏమన్నా స్టయిల్ స్టేట్మెంట్ ఇస్తోందా అంటే అదీ లేదు. అలాంటప్పుడు మరి అదరగొట్టేసిందని ఎవరు మాట్లాడుతున్నారూ? ఎక్కడ మాట్టాడుతున్నారూ?

ఈ హీరోయిన్లకు కూడా నిత్యం లైమ్ లైట్ లో ఉండాలి కాబట్టి మీడియాకు ఇలాంటి ప్రెస్ నోట్లు పంపాలి అనే ఆలోచన రావడం మంచిదే. కాకపోతే అవి కాస్త నిజంగా నిజాయితీగా ఉంటే బెటర్. లేకపోతే ఫీడ్ బ్యాక్ నెగెటివ్‌ గానే వస్తుంది.