Begin typing your search above and press return to search.
లచ్చిందేవి లెక్కకి లక్ ఉందా?
By: Tupaki Desk | 27 Jan 2016 4:15 AM GMTప్రస్తుతం మంచి జోష్ లో ఉంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈమె నటించిన సినిమాలు వరుసగా మూడు సూపర్ హిట్ కొట్టడంతో లక్కీ హ్యాండ్ అనే గుర్తింపు వచ్చేసింది. మనం మూవీలో మినహాయిస్తే... నాని భలే భలే మగాడివోయ్ - నాగ్ సోగ్గాడే చిన్ని నాయన చిత్రాల్లో లావణ్యే మెయిన్ హీరోయిన్.
అందాల రాక్షసితో టాలీవుడ్ కి పరిచయమయ్యి బాగానే గుర్తింపు సాధించుకుంది ఈ భామ. ఇప్పుడు స్టార్ హీరోలతో చేసే స్థాయికి చేరుకుంది. భలే మగాడివోయ్ - సోగ్గాడే చిన్ని నాయన హిట్స్ కొట్టాయంటే.. అవి భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు. నానికి అప్పటికే బోలెడు మంది అభిమానులు ఉండగా.. నాగ్ స్టార్ హీరో. అవి రెండూ హిట్ కొట్టినా.. ఇప్పుడు అమ్మడికి అసలు పరీక్ష ఎదురవుతోంది. ఈ నెల 29న లావణ్య త్రిపాఠి నటించిన లచ్చిందేవికి ఓ లెక్కుంది రిలీజ్ కానుంది. ఇందులో ఈ అందాల రాక్షసి మూడు పాత్రలను చేయడం విశేషం.
ఇంత షార్ట్ పీరియడ్ లో మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం ఏ హీరోయిన్ కి అయిన విశేషమే కానీ.. అన్నింటిలోనూ హిట్ కొట్టడం చాలా క్లిష్టమైన విషయం. పైగా ఇప్పుడు అంతగా గుర్తింపు లేని నవీన్ చంద్ర హీరోగా చేస్తున్నాడు. ఇది కూడా హిట్ అయితే లావణ్యకి గోల్డెన్ లెగ్ అనే పేరు స్థిరపడిపోతుంది. కానీ అదేమంత ఈజీ కాదు. కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో.. నవ్వులు పండితే మాత్రం లావణ్య హ్యాట్రిక్ సక్సెస్ సాధించినట్లే. ఇంతకు ముందు సమంత కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే సెంటిమెంట్ చాలా ఏళ్లు నడిచింది. ఇప్పుడు టాలీవుడ్ కి కొత్త గోల్డెన్ లెగ్ దొరుకుతుందో లేదో తెలియాలంటే.. శుక్రవారం వరకూ ఆగాల్సిందే.