Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఉరకలేస్తున్న రూప లావణ్యం

By:  Tupaki Desk   |   14 Nov 2016 3:30 PM GMT
ఫోటో స్టోరి: ఉరకలేస్తున్న రూప లావణ్యం
X
టాలీవుడ్ కి అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. అరంగేట్రం నుంచి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న ఈ భామకు.. వరుసగా పెర్ఫామెన్స్ బేస్డ్ రోల్స్ వస్తూ ఉండడం విశేషమే. గ్లామర్ వరల్డ్ లో యాక్టింగ్ ట్యాలెంట్ చూపించే ఛాన్స్ అంత తేలికైన విషయమేం కాదు. అలాగే కేరక్టర్స్ విషయంలో చాలామందికి ఉన్న అపోహలను కూడా పోగొట్టేసిందీ బ్యూటీ. పెద్ద స్టార్లతో చేస్తే.. కుర్ర హీరోలు పట్టించుకోరనే ఫీలింగ్స్ కి కూడా చెక్ పెట్టేసింది.

వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు దక్కించుకున్న లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు రెడ్ అనే మేగజైన్ కవర్ పేజ్ పై కలర్ ఫుల్ గా కనువిందు చేసింది. మెరూన్ కలర్ టాప్.. నేవీ బ్లూ స్ట్రైప్స్ తో బాటమ్.. అదే కలర్ ఓవర్ కోట్ లతో కొత్త స్టైలింగ్ ట్రై చేసింది. అమ్మడి ఈ ఫిగర్ కి ఈ గెటప్ భలేగా సూట్ అయిందని చెప్పాలి. మరోవైపు నాభి సోకులను కూడా కాసింతగా ప్రదర్శనకు ఉంచేసరికి.. ఆకర్షణ మరింతగా పెరిగిపోయింది. హెయిర్ స్టైల్ గానీ.. మెడలో వేసుకున్న చైన్ గానీ.. లావణ్య స్టైలింగ్ కి సరిగ్గా సూట్ అయిపోయాయి.

మరోవైపు.. బ్యాక్ గ్రౌండ్ థీమ్ కూడా బాగా క్యాచీగా ఉండడం.. లావణ్య త్రిపాఠి ట్రెండీగా ఉండడం.. ఈ ఫోటోకు బాగా ఎట్రాక్షన్ అయిపోయింది. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుణ్ తేజ్ కి జోడీగా.. శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన మిస్టర్.. ఇప్పుడు వేగంగా షూటింగ్ పూర్తి చేసుకోనుంది.