Begin typing your search above and press return to search.
చీరలో సింగారానికే గంట పట్టేది
By: Tupaki Desk | 8 Jan 2016 9:30 AM GMTచీర కట్టుకోవడం అంటే ఆషామాషీనా? పద్ధతిగా లైనప్ కుదరాలి. బొడ్లో కుచ్చుళ్లు దోపాలి. పవిట చెంగును సరి చేసుకోవాలి. ప్రతిసారీ ఏదీ జారిపోకుండా కాపాడుకోవాలి. అన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టే నార్త్ అమ్మాయిలు పెద్దగా చీర జోలికి పోరు. కానీ అంత కష్టం ఉందని తెలిసినా సినిమాలో ఫలానా సీన్‌కి చీర కావాల్సిందే అని అడిగితే ముంబై మోడల్ అయిన పవిట బిగించాల్సిందే. లేదంటే కుదరదు. సరిగ్గా అలాంటి అనుభవమే అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి వచ్చిందిట. చీరకట్టు గురించి ఈ అమ్మడు చెబుతూ బెంబేలెత్తిపోయింది.
నాగార్జున సరసన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటించాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు సీత. పేరుకు తగ్గట్టే పద్ధతిగా ఉంటాను. అంతేనా పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తాను. అయితే అంతకంటే ముందు నాకు చీరలు ఎక్కువగా కట్టుకున్న అనుభవం లేదు. నిర్మాత సుప్రియ దగ్గరుండి మరీ చీర కట్టించేది. బలవంత పెట్టేసేది. బాబోయ్ చీర కట్టుకోవడానికి గంట సమయం పట్టేది. అలాంటి అనుభవం చాలా కొత్తగా అనిపించింది. అయితే నాగార్జునగారి ప్రోత్సాహంతో ప్రతిదీ సులువైపోయేది.
షూటింగ్ మొదలు పెట్టిన మొదటి రోజే నాలుగు పేజీల డైలాగ్ పేపర్ చేతిలో పెట్టి నటించెయ్ అన్నారు. మొదట భయపడ్డా నెమ్మదిగా సర్ధుకున్నా. డైలాగులన్నీ బట్టీ కొట్టి చెప్పేసా. కేవలం ఆ సీన్ కోసం పూర్తిగా ప్రిపేరై మూడే మూడు టేకుల్లో పూర్తి చేయగలిగాను. .. అంటూ లావణ్యం తన రోల్ గురించి చెప్పింది మరి.