Begin typing your search above and press return to search.
సోగ్గాడి గురించి రాక్షసి కబుర్లు
By: Tupaki Desk | 8 Jan 2016 5:30 PM GMTఅందాల రాక్షసితో పరిచయమై.. భలేభలే మగాడివోయ్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ప్రేక్షుకల ముందుకు రానుంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో కుర్ర నాగ్ పక్కన నటిస్తూ.. మెరుపులు మెరిపించనుంది. మరి తన కొత్త మూవీపై లావణ్య ఏమనుకుంటోంది ? సోగ్గాడి కబుర్లేంటి ?
- సోగ్గాడే చిన్ని నాయన రిలీజ్, రిజల్ట్ పై టెన్షన్ పడుతున్నారా ?
అసలు టెన్షన్ అనే మాటే లేదు. ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రేక్షకులకు పండుగ ట్రీట్ ఈమూవీ. నాగ్ డ్యుయల్ రోల్ ని అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
- మీ పాత్ర గురించి చెప్పండి ?
ఈ సినిమాలో నేను ఓ సాధారణ గృహిణి పాత్ర పోషించాను. నాకు-నాగ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి మొదట్లో నాగార్జున గారితో చేసేందుకు భయపడ్డాను. ఆయన సరదాగా ఉండడమే కాదు, నాకు ధైర్యం చెప్పారు కూడా.
- కెరీర్ లో మొదటిసారి ఇలాంటి రోల్ చేస్తున్నారు, ఎలా అనిపించింది ?
ప్రాజెక్ట్ స్టార్ట్ అయే ముందు, ఈ కేరక్టర్ కి నేను సెట్ అవుతానా అనే అనుమానం ఉంది. కానీ మంచి యాక్టర్ అనిపించుకోవడానికి అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆత్మవిశ్వాసం పెంచుకుని ఈ రోల్ చేశాను.
- చాలా తక్కువ ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నారు. ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా ?
సినిమాలు చేయడంలో చాలా సెలెక్టివ్ గా ఉంటాను. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయన - లచ్చిందేవికి ఓ లెక్కుంది - అల్లు శిరీష్ తో మరొక చేస్తున్నాను. ఇవన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. తక్కువ సినిమాలు చేసినా, నా ప్రత్యేకత నిలబెట్టుకోవాలన్నదే లక్ష్యం.