Begin typing your search above and press return to search.

బ్యాక్‌ లెస్‌ తో సంక్రాంతిని హీటెక్కిచ్చింది

By:  Tupaki Desk   |   17 Jan 2016 3:30 PM GMT
బ్యాక్‌ లెస్‌ తో సంక్రాంతిని హీటెక్కిచ్చింది
X
ఇంతకీ సంక్రాంతికి వచ్చిన హీరోయిన్లలో సూపర్బ్‌ అనిపించుకుందెవరు? ఈ సంక్రాంతికి నాన్నకు ప్రేమతో సినిమాతో రకుల్‌ ప్రీత్‌.. డిక్టేటర్‌ తో అంజలి - సోనాల్‌ చౌహాన్‌ - అక్ష - శ్రద్దా దాస్‌.. ఎక్స్‌ ప్రెస్‌ రాజాతో సురభి.. సోగ్గాడే చిన్ని నాయనాతో లావణ్య త్రిపాఠి.. తమ లక్‌ ను చెక్‌ చేసుకున్నారు. మరి అందరిలో కంటే మార్కులు ఎక్కువ ఎవరికి పడ్డాయ్‌?

మనం ఇక్కడ రెండు క్యాటగిరీలుగా హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి పెర్ఫామెన్స్‌ రెండోది గ్లామర్‌. పెర్ఫామన్స్‌ విషయంలో ఉతికి ఆరేస్తుంది అనుకున్న అంజలికి డిక్టేటర్‌ సినిమాలో అసలు స్కోప్‌ చాలా తక్కువ. అలాగే మిగిలిన హీరోయిన్లకు కూడా అంత సీన్‌ లేదక్కడ. సురభి కూడా ఏదో సోసో గానే యాక్టింగ్‌ చేసింది. ఇక లావణ్య త్రిపాఠికి పెద్దగా అరిపించేంత క్యారెక్టర్‌ ఏమీ పడలేదు. కాని నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్‌ మాత్రం రఫ్ఫాడించేసింది. తన బడీ లాంగ్వేజ్‌ - డబ్బింగ్‌ తో ఆకట్టుకుంది. సో.. యాక్టింగ్‌ వైజ్‌ చూసుకుంటే.. ఆమె బెస్ట్‌ అని చెప్పాలి.

మరి గ్లామర్‌ వైజ్‌ చూసుకుంటే.. రకుల్‌ ప్రీత్‌ అంటేనే గ్లామర్‌ క్వీన్‌. కాని నాన్నకు ప్రేమతో సినిమాలో ఎందుకు ఆమె గ్లామర్‌ అంతగా ఆనలేదు. అయితే.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో లావణ్య త్రిపాఠి మాత్రం.. తన బ్యాక్‌ లెస్‌ అందాలతో మోత మోగించింది. ఆమె కనిపించే తొలి సీన్లోనే.. కేవలం ఒక ఇంచ్‌ బ్యాక్‌ డిజైన్‌ ఉన్న బ్లౌజుతో కనిపించి.. టోటల్‌ స్లోపును తెరపై ఆరబోస్తూ.. మత్తెక్కించేసింది. ఇక సినిమా అంతా నడుం వంక అంటూ ఆ సెలయేటి హొయలను దర్శకుడు బాగానే క్యాష్‌ చేసుకున్నాడు. సో.. సరైన సంక్రాంతి హాటీ తనే అనాలి మరి.