Begin typing your search above and press return to search.

మరో యాంగిల్ చూడమంటున్న లావణ్య

By:  Tupaki Desk   |   1 April 2016 5:09 AM GMT
మరో యాంగిల్ చూడమంటున్న లావణ్య
X
లావణ్య త్రిపాఠికి సల్వార్ సూట్స్ పై బోర్ కొట్టేసిందట. ఇక నుంచి బాగా యంగ్ గా, గ్లామర్ గా ఉండే రోల్స్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతోంది. తనకు చాలానే ఆఫర్స్ వస్తున్నా.. తన ఒరిజినల్ ని ప్రదర్శించే అవకాశం రాలేదన్నది ఈ అందాల రాక్షసి వెర్షన్. తాను చాలా కూల్ గా ఉండే ఫన్నీ పర్సన్ అని.. అలాంటి కేరక్టర్ లో ప్రేక్షకులు తనను పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తోంది లావణ్య.

'ప్రస్తుతం నేనింకా దారిలోనే ఉన్నా. ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదు. ప్రేక్షకులు ముందు నన్ను మిధున(అందాల రాక్షసి పాత్ర)గా గుర్తించారు, ఆ తర్వాత నందన(భలే భలే మగాడివోయ్) అన్నారు, ఇప్పుడు సీత(సోగ్గాడే చిన్నినాయన) అంటున్నారు. నేను చేసిన కేరక్టర్లు వారిని మెప్పించడం సంతోషమే అయినా.. ఇంకా నన్ను నన్నుగా గుర్చించాలని కోరుకుంటున్నా. నాలోని ఆ యాంగిల్ జనాలకు తెలీదు, తెలిస్తే బాగా రిసీవ్ చేసుకుంటారు' అంటోందీ అందాల రాక్షసి.

సీనియర్ హీరో నాగార్జునకు భార్యగా కేరక్టర్ ఒప్పుకున్నపుడు అందరూ హెచ్చరించారని.. ఇక సీనియర్ హీరోయిన్ అనే ముద్ర వేస్తారని అన్నారని చెప్పింది లావణ్య. ఇలాంటివేమీ తాను పట్టించుకోలేదని, అయినా అవి నిజం కాదని తాను ప్రూవ్ చేస్తున్నానంటోంది. అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తులతో పాటు.. వరుణ్ తేజ్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో ప్రారంభం కానున్న సినిమాలోనూ లావణ్యనే హీరోయిన్. అంటే.. ఒక సినిమాతో ముద్ర పడిపోతుందనే టాక్ ని లావణ్య చెరిపేసినట్లే కదా.