Begin typing your search above and press return to search.
కౌన్సిలింగ్ ఇస్తానంటున్న అందాల రాక్షసి
By: Tupaki Desk | 11 July 2016 5:06 AM GMTఅందం అభినయం ఉన్న అరుదైన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి కూడా ఉంటుంది. ప్రతీ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలను ఎంచుకుంటూ విభిన్నంగా తన కెరీర్ ని మలుచుకుంటోంది ఈ అందాల రాక్షసి. పైగా కుర్ర హీరోలతో సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ.. డిఫరెంట్ రూట్ లో దూసుకుపోతోంది. ఇప్పుడో సీవీ కుమార్ దర్శకత్వంలో ఓ తమిళ్ సినిమాకి లావణ్య సైన్ చేసింది. ఈ కోలీవుడ్ మూవీలో హీరోగా సందీప్ కిషన్ నటించనున్నాడు.
'ఈ మూవీలో నేను ఓ సైక్రియాట్రిస్ట్ పాత్రను పోషించబోతున్నాను. ఇది చాలా మెచ్యూర్డ్ అమ్మాయి పాత్ర. ఇలాంటి రోల్ ని నేను ఇప్పటివరకూ చేయలేదు. పైగా ఈ సైక్రియాట్రిస్ట్ చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది. ఈ పాత్రను పోషించేందుకు నేను చాలా రీసెర్చ్ చేశాను. కౌన్సిలింగులు ఇచ్చేటప్పుడు వారి హావభావాలు ఎలా నిలకడగా ఉంటాయో తెలుసుకున్నాను. నా పెర్ఫామెన్స్ ఇందులో సైలెంట్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. గతంలో చేసిన సినిమాల మాదిరిగా ఎనర్జిటిక్ రోల్ కాదు.' అని చెప్పింది లావణ్య త్రిపాఠి.
సందీప్ కిషన్ తో చాలా రోజుల నుంచి ఫ్రెండ్ షిప్ ఉండడంతో.. అతనితో చేయడం చాలా ఈజీ అయిపోతుందన్నది ఈ అందాల రాక్షసి లెక్క. గతంలోనే బ్రహ్మనన్ అనే సినిమాతో లావణ్య తమిళ్ అరంగేట్రం చేయగా.. అప్పటికీ ఇప్పటికీ తను తమిళ్ భాష నేర్చుకున్నానని.. ఇది పాత్రను అర్ధం చేసుకుని తన యాక్టింగ్ స్కిల్స్ పెంచుకునేందుకు ఉపయోగపడతుందని లావణ్య త్రిపాఠి చెబుతోంది.