Begin typing your search above and press return to search.

'దుర్గ' ఫస్ట్ లుక్: భయంకరమైన గెటప్ లో రాఘవ లారెన్స్..!

By:  Tupaki Desk   |   6 Aug 2021 1:46 PM GMT
దుర్గ ఫస్ట్ లుక్: భయంకరమైన గెటప్ లో రాఘవ లారెన్స్..!
X
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్‌.. ఈ క్రమంలో దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హారర్‌ కామెడీ జోనర్ చిత్రాలతో తెలుగు తమిళ ప్రేక్షకులను మెప్పించిన లారెన్స్.. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోగా రెండు చిత్రాల్లో నటిస్తున్న లారెన్స్.. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

''దుర్గ'' అనే టైటిల్ తో చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్.. దీనికి అందరి ఆశీస్సులు కావాలని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఈ సందర్భంగా 'దుర్గ' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి ఈ చిత్రంలో తన భయానక గెటప్ ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో లారెన్స్ తెల్లటి పొడవాటి గడ్డం.. గుబురు మీసాలు. నుదుటన పెద్ద బొట్టుతో సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఇందులో లారెన్స్ లుక్ మునులు ఋషులను గుర్తు చేస్తోంది.

విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న మల్టీటాలెంటెడ్ రాఘవ లారెన్స్.. కెరీర్ లో ఎన్నడూ పోషించని క్యారక్టర్ ను 'దుర్గ' చిత్రంలో ప్లే చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇన్నాళ్లూ హారర్ సినిమాలతో భయపెడుతూ వచ్చి, ఇప్పుడు ఏకంగా గెటప్ తోనే భయం పుట్టిస్తున్నాడు. ఏదేమైనా ఫస్ట్ లుక్ తోనే లారెన్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారని చెప్పాలి. ఈ చిత్రాన్ని తన హోమ్ బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు రాఘవ. ఈ మూవీకి సంబంధించిన నటీనటులు సంకేతాలు నిపుణులు వంటి ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇకపోతే చివరిగా 'కాంచన 3' చిత్రంలో హీరోగా నటించిన రాఘవ లారెన్స్.. ప్రస్తుతం ''రుద్రన్'' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎస్. కదిరేసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదే క్రమంలో ''అధికారమ్'' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. 'ధర్మయోగి' 'పటాస్' చిత్రాల దర్శకుడు దురై సెంథిల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ మరియు ఫైవ్ స్టార్ క్రియేషన్స్ పతాకంపై వెట్రి మారన్ - ఎస్. కదిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన లారెన్స్ ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది.