Begin typing your search above and press return to search.
లారెన్స్‌కు అంత కాన్ఫిడెన్స్ ఏంటో!
By: Tupaki Desk | 12 April 2015 11:30 PM GMTరాఘవ లారెన్స్ ఎప్పుడూ అంతే మరి. టూమచ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. అందుకే అప్పుడప్పుడూ గట్టి ఎదురుదెబ్బలే తింటుంటాడు. ముని సిరీస్‌లో వస్తున్న మూడో సినిమా 'గంగ' విషయంలోనూ లారెన్స్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. లారెన్స్ గత సినిమా రెబల్ అట్టర్ ఫ్లాప్ అయింది. గంగ సినిమా మొదలుపెట్టిన రెండేళ్లకు గానీ విడుదల కావట్లేదు. ఇక నిర్మాత బెల్లంకొండ పరిస్థితేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ట్రాక్ రికార్డుతో వస్తున్నపుడు సినిమాను కాస్తో కూస్తో ప్రమోట్ చేయాలి కదా. ఆడియో ఫంక్షన్ చేసి సినిమా జనాల నోట్లో నానేట్లు చూసుకోవాలి కదా.
కానీ లారెన్స్ మాత్రం ప్రమోషన్ సంగతే పట్టించుకోకుండా నేరుగా సినిమాను థియేటర్లలోకి తెచ్చేయబోతున్నాడు. తమిళ సినిమాను కాస్తో కూస్తో జనాలకు దగ్గర చేస్తున్న లారెన్స్ తెలుగు వెర్షన్‌ను అస్సలు పట్టించుకోవట్లేదు. బెల్లంకొండ కూడా ఇది నా సినిమా కాదు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఈ నెల 17న 'గంగ' థియేటర్లలోకి రాబోతోంది. కాంఛన-2 ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి పెద్ద హిట్టయింది. అదే కోవలో జనాలు అంచనాలు లేకుండా సినిమాకు వస్తేనే మేలని లారెన్స్ అనుకుంటున్నాడో ఏమో. సినిమాలో చాలా సర్‌ప్రైజ్ ఎలిమెంట్లున్నాయి కాబట్టి జనాలు ఓపెన్ మైండ్‌తో థియేటర్లకు వచ్చి షాకవుతారని.. ఆ తర్వాత ఆటోమేటిగ్గా సినిమా ఇరగాడేస్తుందని లారెన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని చెబుతున్నారు సన్నిహితులు. చూద్దాం ఏమవుతుందో!