Begin typing your search above and press return to search.

పోలీసుల ‘ఇంటరాగేష’న్ లో లారెన్స్

By:  Tupaki Desk   |   22 Jun 2016 4:02 AM GMT
పోలీసుల ‘ఇంటరాగేష’న్ లో లారెన్స్
X
ప్రఖ్యాత నృత్య దర్శకుడు లారెన్స్ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఒక కేసు వ్యవహారంలో ఆయన పాత్ర మీద అనుమానంతో పోలీసులు ఆయన్ను విచారించటం కలకలం రేపుతోంది. తమిళనాడు క్రైంబ్రాంచ్ పోలీసులు లారెన్స్ ను రెండు గంటల పాటు విచారించటం తమిళ.. తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. వేందర్ మూవీస్ అధినేత మదన్ మిస్సింగ్ అయి 25 రోజులు అవుతోంది. ఇందులో లారెన్స్ మీద సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇంతకీ ఈ మదన్ ఎవరు? ఆయన మిస్సింగ్ కేసు అన్న విషయాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఎస్ ఆర్ ఎం వర్సిటీలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయిలు కొల్లగొట్టినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 25 రోజుల నుంచి మదన్ అదృశ్యం కావటంతో ఇదో ఇష్యూగా మారింది. బాధితుల ఫిర్యాదుతో మదన్.. వర్సిటీ అధినేత పచ్చముత్తులపై పలు కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మదన్ మిస్ కావటం.. తదితర అంశాలపై పోలీసులు విచారణ షురూ చేశారు. ఇందులో భాగంగా మదన్ కుటుంబ సభ్యుల్ని విచారించిన సందర్భంగా ప్రముఖ నృత్య దర్శకుడు లారెన్స్ కు మదన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో.. మదన్ అదృశ్యానికి సంబంధించి లారెన్స్ కు సమాచారం తెలుసన్న సందేహంతో ఆయన్ను క్రైం బ్రాంచ్ పోలీసులు రెండు గంటల పాటు విచారణ జరిపారు. ఇదిలా ఉంటే.. విచారణ అధికారులు మదన్ ఆఫీసును సోదాలు నిర్వహించగా.. పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన బ్యాంక్ డ్రాప్ట్ లు బయటపడ్డాయి. దీంతో.. మదన్ కు ఎస్ ఆర్ ఎం వర్సిటీ గ్రూప్ కు మధ్య సంబంధాలు ఉన్నాయన్నది కన్ఫర్మ్ అయినట్లుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.