Begin typing your search above and press return to search.
లారెన్స్ హార్రర్‌కు ముహూర్తం కుదిరింది
By: Tupaki Desk | 8 April 2015 7:30 PM GMTఅదేంటో ఒక ఆడియో ఫంక్షన్ లేదు.. ఒక ప్రమోషన్ కార్యక్రమం లేదు. సడెన్‌గా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు రాఘవ లారెన్స్. రెబల్ లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత రెండేళ్లకు పైగా ఎన్నో కష్టాలకు ఓర్చి లారెన్స్ తీసిన హార్రర్ కామెడీ 'కాంఛన-2' ఇంకో వారంలో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ నెల 16న 'కాంఛన-2' విడుదల కాబోతున్నట్లు ప్రకటించాడు లారెన్స్. నిన్నే సెన్సార్ కూడా పూర్తి చేయిపోయింది. యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారీ సినిమాకు. ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి ఇచ్చిన ఆడియోను డైరెక్టుగా మార్కెట్లోకే రిలీజ్ చేసేశాడు లారెన్స్.
ఐతే 16న కేవలం తమిళ వెర్షన్ మాత్రమే సినిమాను విడుదల చేస్తాడేమో.. తెలుగు వెర్షన్ ఆలస్యమవుతుందేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వెర్షన్‌కు సంబంధించి టాలీవుడ్‌లో ఏ సందడీ కనిపించట్లేదు. కనీసం ఓ ప్రెస్ మీట్, ప్రెస్ నోట్ లాంటివి కూడా ఏమీ లేవు. మామూలుగా అయితే బెల్లంకొండ సురేష్ తన సినిమాలకు చాలా హంగామా చేస్తాడు. కానీ 'కాంఛన-2' గురించి ఏం మాట్లాడట్లేదు. అయినా పర్లేదని రిలీజ్ చేసేస్తారా.. లేక కొంచెం టైం తీసుకుంటారా చూడాలి. నిత్యమీనన్ నటించిన 'ఓకే కణ్మణి' 17న రావాల్సి ఉంది. దానికి ముందు రోజే ఆమె నటించిన 'కాంఛన-2' కూడా విడుదలైతే విచిత్రమే.