Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీనే దించేసిన లారెన్స్!

By:  Tupaki Desk   |   22 Sep 2022 10:57 AM GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీనే దించేసిన లారెన్స్!
X
మ‌ల్టీ ట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ రాఘ‌వ లారెన్స్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటుల్లో లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్‌గా సౌత్ సినిమాలో ఎంతో ఫేమస్. సక్సెస్ ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా.. నటుడిగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం కొరియోగ్ర‌ఫీకి దూరంగా ఉంటూ ద‌ర్శ‌కుడిగా..న‌టుడిగా కొన‌సాగుతున్నారు.

ఆయన హీరోగా న‌టించిన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. చివ‌రిగా 'కాంచ‌న‌-3'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఆ త‌ర్వాత కోవిడ్ ప్రారంభంతో లారెన్స్ మ్యాక‌ప్ కి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే కొత్త‌త చిత్రాలు లాక్ చేసారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా కోలీవుడ్ లో నాలుగైదు చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. వీటిలో మూడు చిత్రాల‌పై భారీ అంచ‌నాలున్నాయి.

'చంద్ర‌ముఖి-2'..'దుర్గ‌'..'రుద్ర‌న్' సినిమాల రిలీజ్ కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రుద్ర‌న్ తెలుగులో రుద్రుడుగా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్ట‌ర్ ఒక‌టి రిలీజ్ అయింది. ఇందులో లారెన్స్ న‌లుపు రంగు దుస్తులు ధ‌రించి క‌నిపిస్తున్నారు. లుక్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను పోలిన‌ట్లు ఉంది.

ర‌జ‌నీ స్టైల్ హెయిర్ స్టైల్.. స్మైల్..ఆహార్యం అన్ని ర‌జ‌నీని త‌ల‌పిస్తున్నాయి. లుక్ ప‌రంగా ఈ స్టిల్ కోసం సూప‌ర్ స్టార్ నే అనుక‌రించిన‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో అభిమానులు ర‌జ‌నీ మ్యాన‌రిజమ్ ని కాపీ చేస్తున్నాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ర‌జ‌నీ స్మైల్ ని మాత్రం ఉన్న‌ది ఉన్న‌ట్లుగా దించేసాడు.. సూప‌ర్బ్ అంటూ ఇద్ద‌రి హీరోల అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఈ చిత్రంలో శరత్ కుమార్.. పూర్ణిమ భరద్వాజ్.. నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆర్‌డి రాజశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఆంథోని ఎడిటర్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేస్తున్నారు. అలాగే లారెన్స్ న‌టిస్తోన్న ఇత‌ర చిత్రాలు 'చంద్ర‌ముఖి-2' ఆన్ సెట్స్ లో ఉంది. 'దుర్గ' సినిమా అనౌన్స్ మెంట్ జ‌రిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.