Begin typing your search above and press return to search.
'రుద్రుడు'గా వస్తున్న లారెన్స్ మాస్టర్
By: Tupaki Desk | 22 Jun 2022 3:45 PM GMT'కాంచన' సిరీస్ తో బ్లాక్ బస్టర్లు అందుకున్న లారెన్స్ మాస్టార్ చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికి సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ 'రుద్రుడు'గా తిరిగి వస్తున్నాడు. రాఘవ లారెన్స్ రుద్రుడు (రుద్రన్-తమిళం) యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ జూన్ 23న (గురువారం) సాయంత్రం 5.45 కి విడుదల కానుంది.
ఆ మేరకు తాజాగా ఒక ప్రకటనను వెలువరించింది టీమ్. కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.
రుద్రన్ కు కతిర్ సేన్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది.
నటుడు-రాజకీయవేత్త శరత్ కుమార్ కూడా రాఘవ లారెన్స్ తో స్క్రీన్ స్పేస్ ను పంచుకున్నారని తెలిసింది.
కాంచన (ముని 2) తర్వాత లారెన్స్ - శరత్ కుమార్ జోడీ మరోసారి అదిరే ట్రీట్ ఇవ్వనున్నారని సమాచారం.
1962 క్లాసిక్ చిత్రం 'వీర తిరుమగన్'లో PB శ్రీనివాస్ - S జానకి పాడిన 'పడతా పట్టెల్లం' రీమిక్స్ వెర్షన్ అలరించనుందని ఈ పాటకు లెజెండరీ రైటర్ కన్నదాసన్ సాహిత్యం అందించారని తెలుస్తోంది. కతిరేసన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ నిర్మించింది.
పి.వాసు దర్శకత్వం వహిస్తున్న చంద్రముఖి సీక్వెల్ లో వడివేలుత పాటు రాఘవ లారెన్స్ కూడా నటిస్తున్నారని ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రం 2005 క్లాసిక్ హిట్ చంద్రముఖికి సీక్వెల్. కానీ తారాగణం మారారు.