Begin typing your search above and press return to search.
నేను నాలుగో హీరో అంటున్న లారెన్స్
By: Tupaki Desk | 23 Nov 2016 7:30 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘చంద్రముఖి’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తీసిన సీనియర్ డైరెక్టర్ పి.వాసు.. తాజాగా కన్నడలో ‘శివలింగ’ అనే సినిమా తీశాడు. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ-తెలుగు భాషల్లో లారెన్స్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు వాసు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో తాను లీడ్ హీరో కాదని.. తాను నాలుగో హీరో అని అన్నాడు.
‘‘శివలింగ సినిమాకు కథే తొలి హీరో. రితికా సింగ్ రెండో హీరో. వాసు గారి అబ్బాయి శక్తి వాసు మూడో హీరో. నేను నాలుగో హీరోని. ‘కాంచన’ సినిమా తీశాక దాని కంటే పెద్ద సినిమా చేయాలనుకున్నా. ‘గంగ’ చేశాను. తర్వాత దాన్ని మించిన సినిమా చేయాలని చూశాను. అప్పుడే వాసు గారు ‘శివలింగ’ సినిమా చూడమన్నారు. చాలా నచ్చింది. ఇందులో బలమైన కథ ఉంది. ‘చంద్రముఖి’లో జ్యోతిక నటనకు ఎలాంటి పేరు వచ్చిందో.. ఇందులో రితిక చేసిన పాత్రకు అంత పేరొస్తుంది. కాంచన లాంటి సినిమా చేసిన నాకు ఇందులో రితికాను చూస్తే భయమేసింది. ఇంటర్వెల్ సీన్లో ఆమె పెర్ఫామెన్స్ అద్భుతం. నా ఫేవరెట్ హీరో రజినీకాంత్ గారిని డైరెక్ట్ చేసిన వాసు గారి దర్శకత్వంలో నటించడం నా అదృష్టం’’ అని లారెన్స్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/