Begin typing your search above and press return to search.

తమిళ 'రంగస్థ‌లం' విషయంలో మెగా ఫ్యాన్స్ కి మరో బోన‌స్...?

By:  Tupaki Desk   |   25 Aug 2020 11:00 PM IST
తమిళ రంగస్థ‌లం విషయంలో మెగా ఫ్యాన్స్ కి మరో బోన‌స్...?
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ''రంగస్థలం''. ఎమోషనల్‌ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌ చరణ్ 'చిట్టిబాబు'గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని సమంత 'రామలక్ష్మి'గా అదరగొట్టింది. టాలీవుడ్ లో రికార్డ్‌ లను తిరగరాసిన ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేయబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ సరైన కాంబినేషన్‌ సెట్ కాకపోవటంతో రీమేక్ ఇంకా తెర మీదకు రాలేదు. ఇన్నాళ్లు చిట్టిబాబు మరియు రామలక్ష్మి పాత్రలకు ఎవరైతే న్యాయం చేస్తారో అనే చర్చలోనే గడిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్లు ఫిక్స్‌ అయినట్టుగా కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా తెలుగు 'రంగస్థలం'లో చరణ్ పోషించిన పాత్రలో తమిళ్‌ లో నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్‌ కనిపించబోతున్నాడట. అంతేకాకుండా సమంత రోల్ లో నిక్కీ గ‌ల్రానీ నటిస్తోందట. ఇప్పటికే ఈ విషయంలో చర్చలు జరిపారని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది. ఇక తమిళ్ 'రంగస్థలం' కి దర్శకుడు ఎవరన్నది ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి మెగా అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారట. రామ్ చరణ్ నటించిన 'రంగ‌స్థ‌లం' వంటి క్లాసిక్ ని చెడ‌గొడుతున్నారని ఫీల్ అవుతున్నారట. ఇది చాలదన్నట్లు లారెన్స్ లో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండ‌టంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేయాల‌ని ప్లాన్స్ చేస్తున్నారట. ఇప్పటికే ఫీల్ అవుతున్న మెగా ఫ్యాన్స్ కి ఈ న్యూస్ మరో బోన‌స్ లా అనిపిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.