Begin typing your search above and press return to search.

లారెన్స్‌ది అత్యాశ కాక మరేంటి?

By:  Tupaki Desk   |   5 July 2015 1:30 PM GMT
లారెన్స్‌ది అత్యాశ కాక మరేంటి?
X
లారెన్స్‌ కాన్ఫిడెన్స్‌ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి బ్యాగ్రౌండ్‌ తెలిసి డ్యాన్స్‌ డైరెక్టర్‌ కావడమే ఎక్కువన్నారు. కానీ హీరో అయ్యాడు. అక్కడికే టూమచ్‌ అనుకుంటే.. డైరెక్షన్‌ కూడా చేశాడు. ఆ తర్వాత తనే హీరోగా సినిమాలు తీసి జనాల్ని మెప్పించాడు. కాంచన, కాంఛన-2 సినిమాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టి అటు తమిళంలో, ఇటు తెలుగులో మాస్‌కు ఫేవరెట్‌ హీరో కమ్‌ డైరెక్టర్‌ అయ్యాడు. మామూలుగా అయితే లారెన్స్‌ లాంటి వాణ్ని ఆడియన్స్‌ హీరోగా ఒప్పుకోరు. కానీ లారెన్స్‌ ఒప్పించాడు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఇప్పుడు తన తమ్ముడు ఎల్విన్‌ను హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.

ఈ సినిమాకు తనే దర్శకత్వం వహించి నిర్మించబోతున్నాడు లారెన్స్‌. కలర్‌ విషయంలో లారెన్స్‌ ఏమీ తీసిపోయేలా లేడు ఎల్విన్‌. అయినప్పటికీ తన తమ్ముడి పక్కన చందమామ కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్‌గా పెట్టాలని భావించాడు లారెన్స్‌. తనకున్న క్రేజ్‌ చూసి కాజల్‌ మరో మాట లేకుండా ఒప్పేసుకుందనుకున్నాడు. కానీ లారెన్స్‌ ఆఫర్‌ను మరో మాట లేకుండా తిరస్కరించింది కాజల్‌. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయని.. ఇంకో ఏడాది వరకు తీరిక లేదని.. కాబట్టి ఈ సినిమా చేయలేకపోతున్నానని పైకి చెప్పినప్పటికీ.. ఐదారేళ్లుగా పెద్ద హీరోలతో మాత్రమే సినిమా చేస్తూ ఇప్పుడు తన కలర్‌కు ఏమాత్రం మ్యాచ్‌ కాని కొత్త హీరో పక్కన సినిమా చేస్తే తన వాల్యూ పడిపోతుందన్న ఉద్దేశంతోనే కాజల్‌ నో చెప్పినట్లు తెలుస్తోంది. అయినా తన తమ్ముడి పక్కన కాజల్‌ను హీరోయిన్‌గా పెట్టాలనుకోవడం లారెన్స్‌ అత్యాశ కాక మరేంటి?