Begin typing your search above and press return to search.

చిరంజీవి గుట్టు విప్పిన లారెన్స్

By:  Tupaki Desk   |   10 Oct 2015 6:08 AM GMT
చిరంజీవి గుట్టు విప్పిన లారెన్స్
X
రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను మకుటం లేని మహారాజులా ఏలిన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. ఆ రారాజుకు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి రెండు సినిమాలతోనే తనేంటో రుజువు చేసుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు రామ్ చరణ్. తన టైంలో చిరంజీవి డ్యాన్సుల వరకు నెంబర్ వన్ అనిపించుకున్నాడు. అసలు తెలుగు పరిశ్రమలో డ్యాన్సులకు క్రేజ్ తెచ్చిందే చిరంజీవి. ఐతే డ్యాన్స్ విషయంలో అంత గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. తన కొడుకు చరణ్ ఎలా డ్యాన్స్ చేస్తాడా అని అతను సినిమాల్లోకి రాకముందు చాలా టెన్షన్ పడ్డాడట. చరన్ తన పేరు నిలబెడతాడో లేదో అని ఆందోళన చెందాడట. ఈ సంగతి రాఘవ లారెన్స్ వెల్లడించాడు.

చెన్నైలో బ్రూస్ లీ తమిళ వెర్షన్ ఆడియో ఫంక్షన్ లో లారెన్స్.. చిరంజీవి ఒకప్పుడు చరణ్ విషయంలో టెన్షన్ పడటం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

‘‘తెలుగులో నేను నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అయ్యానంటే అందుకు కారణం చిరంజీవి గారే. చరణ్ విషయంలో చిరంజీవి ఎంత టెన్షన్ పడ్డారో నాకింకా గుర్తు. ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా పాటకు స్టెప్స్ కంపోజ్ చేయిస్తున్నపుడు చరణ్ అక్కడే ఉన్నాడు. ఓసారి చరణ్ తో డ్యాన్స్ చేయించి చూడమని చిరంజీవి నాతో పాటు ఓ గదిలోకి పంపించాడు. ఆ తర్వాత చిరంజీవి కూతురి పెళ్లికి అతడితో డ్యాన్స్ చేయిద్దాం అనుకున్నాం. వారం రోజులు నేనే ట్రైనింగ్ ఇచ్చా. ఐతే ఆ టైంలో చిరు సార్ చాలా టెన్షన్ పడ్డాడు. చరణ్ పనికొస్తాడా పనికొస్తాడా అని చాలా టెన్షన్ గా అడిగారు. అప్పుడు నేను కుర్రాడు దుమ్ముదులుపుతాడు చూడండి అన్నాను. నిజంగానే అక్క పెళ్లిలో చరణ్ అదరగొట్టాడు’’ అని లారెన్స్ చెప్పాడు.