Begin typing your search above and press return to search.
లారెన్స్ మాస్టార్ కి తీరని అవమానం
By: Tupaki Desk | 19 May 2019 6:35 AM GMTలారెన్స్ మాస్టార్ సడెన్ బాంబ్ పేల్చారు. ఉన్న ఫలంగా బాలీవుడ్ ఎంట్రీ మూవీ `లక్ష్మీ బాంబ్` నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి సంచలనానికి కారణమయ్యాడు. కిలాడీ అక్షయ్ కుమార్ అంత పెద్ద స్టార్ నటిస్తున్న ఈ ప్రాజెక్టు నుంచి తాను అర్థాంతరంగా తప్పుకోవడం పెను సంచలనమైంది. అసలింతకీ ఏం జరిగింది? ఎవరితో అతడికి కుదరలేదు? అన్న ప్రశ్నలకు లారెన్స్ మాస్టార్ స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి నిన్నటి రోజున `లక్ష్మీ బాంబ్` ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో కిలాడీ అక్షయ్ కుమార్ మాంత్రికుడి తరహా గెటప్ తో కనిపించారు. పోస్టర్ కి జనం నుంచి చక్కని స్పందన వచ్చింది. అయితే తాను దర్శకత్వం వహించే సినిమాకి సంబంధించి కనీస మాత్రంగా అయినా తనకు తెలియకుండానే ఇలా ఫస్ట్ లుక్ లాంచ్ చేసేయడం తనని అగౌరవపరచడమేనని లారెన్స్ ఆవేదనను వ్యక్తం చేశారు.
లారెన్స్ రాసిన సుదీర్ఘ లేఖలో సంగతులు ఇలా ఉన్నాయి. ``హాయ్ .. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. తమిళంలో ఒక పాపులర్ కహానీ ఉంది. నీకు ఎక్కడ గౌరవం దక్కదో ఆ ఇంటికి వెళ్లకు! అనేది దాని సారాంశం. ఈ సువిశాల ప్రపంచంలో డబ్బు.. ఫేం.. ని మించి ఆత్మ గౌరవం చాలా ఇంపార్టెంట్. అది వ్యక్తిగత క్యారెక్టర్ ని తెలియజేస్తుంది. అందుకే నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను. కాంచన హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ కి నేను ఇక దర్శకత్వం వహించబోను. ఇందుకు ఫలానా కారణం అంటూ చెప్పలేను. రకరకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్న సంగతిని నేను వేరొక వ్యక్తి ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది. దీనిని నేను ఎంతో పెయిన్ ఫుల్ గా భావిస్తున్నారు. ఒక దర్శకుడిగా నా సినిమా తొలి లుక్ నేను చూడకుండా బయటకు వస్తుందా? అస్సలు నాకు గౌరవం లేనే లేదా.. చాలా నిరాశపడ్డాను`` అని లేఖ రాశారు. మొత్తానికి లారెన్స్ మాస్టార్ కి జరిగిన అవమానాన్ని సాధాసీదాగా భావించలేం. తెలియక జరిగిన తప్పుగానూ చూడలేం. ప్రపంచంలో అన్నిటికంటే ఆత్మగౌరవం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో లారెన్స్ మాస్టార్ కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఇక సౌత్ నుంచి ఉత్తరాదికి వెళ్లే వారికి చాలా మందికి ఇలాంటి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇదివరకూ కిలాడీ అక్షయ్ కుమార్ ని మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన సంగతి తెలిసిందే. లారెన్స్ విషయంలో ఈ తప్పిదం గురించి అక్షయ్ కి తెలుసా.. లేదా? అన్నది తెలియాల్సి ఉందింకా.
లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో షబీనా ఎంటర్ టైన్ మెంట్స్- తుషార్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 5 జూన్ 2020 రిలీజ్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరంభమే వివాదం మొదలైంది. దర్శకుడు లారెన్స్ అలకతో ఈ ప్రాజెక్టు కోసం ఎవరిని దర్శకుడిగా ఎంపిక చేస్తారు? అన్నది వేచి చూడాలి.