Begin typing your search above and press return to search.

వివాదంలో ప్రియాంక హాలీవుడ్ సీరియల్

By:  Tupaki Desk   |   30 Oct 2015 1:11 PM GMT
వివాదంలో ప్రియాంక హాలీవుడ్ సీరియల్
X
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటించిన క్వాంటికో సీరియల్ వివాదంలో చిక్కుకుంది. తమ కాన్సెప్ట్ ను కాపీ చేశారంటూ ఓ నిర్మాత కోర్టుకెక్కాడు. 1999లో టెలికాస్ట్ అయిన ఓ డాక్యుమెంటరీ ఆధారంగా ఈ సీరయల్ ని తీశారన్నది ప్రొడ్యూసర్ మార్క్ గొర్డాన్ ఆరోపణ.

అప్పట్లో టెలికాస్ట్ అయిన డాక్యుమెంటరీ పేరు క్వాంటికో: ది మేకింగ్ ఆఫ్ యాన్ ఎఫ్బీఐ ఏజంట్. ఆ డాక్యుమెంటరీ నిర్మాతలు, ఇప్పుడు సీరియల్ తీసిన ప్రొడ్యూసర్లు పరిచయం ఉన్నవారే కావడం విశేషం. దీనికి సంబంధించి ఎటువంటి సమచారాన్ని, డైలాగ్స్ ను, సన్నివేశాలను ఉపయోగించుకోరాదని వీరి మధ్య ఒప్పందం కూడా ఉందట. వీటన్నిటి వివరాలతో 35 పేజీల ఫిర్యాదును లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్ట్ లో వేశారు డాక్యుమెంటరీ నిర్మాతలు.

పాపం ఈ సీరియల్ కోసం ప్రియాంక చాలానే కష్టాలు పడుతోంది. షూటింగుల కోసం అమెరికా, ఇండియాల మధ్య చక్కర్లు కొడుతోంది. బికినీ వేసి అందాలు ఆరబోసింది. అంతేనా కార్ లోనే కొలీగ్ తో సెక్స్ చేసే సన్నివేశంలోనూ యాక్ట్ చేసింది. ఇంత కష్టపడితే ఇప్పుడు కాపీ అన్న వివాదం రావడంతో.. ప్రియాంక ఫీలవుతోందట. అయితే.. ఇది కూడా ఆ సీరియల్ కి పబ్లిసిటీ తెచ్చే అంశమే అంటున్నారు కొంతమంది.