Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ సారీ చెప్పాల్సిందే

By:  Tupaki Desk   |   30 Dec 2017 11:43 AM IST
పవర్ స్టార్ సారీ చెప్పాల్సిందే
X
ఇక్కడ అన్నది మన పవన్ కళ్యాణ్ ని కాదు లేండి. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అక్కడి ఫాన్స్ ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ గురించి. గత వారం విడుదలైన అంజని పుత్ర అనే సినిమాలో ఇతనే హీరో. ఇందులో తమను కించపరిచేలా తీవ్రమైన పదజాలం - సన్నివేశాలు ఉన్నాయని లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు ఫైల్ చేస్తే ప్రదర్శన నిలిపివేయమని కోర్ట్ స్టే ఇచ్చింది. కాని విచిత్రంగా కోర్ట్ ఆర్డర్ లెక్క చేయకుండా షోలు కంటిన్యూ చేయటం ఇప్పుడు వివాదంగా మారింది. తాజాగా బెంగుళూరులో ప్రెస్ తో సమావేశం జరిపిన లాయర్లు పునీత్ రాజ్ కుమార్ కనక క్షమాపణ చెప్పకపోతే ఉద్యమం చేపడతామని అల్టిమేటం జారీ చేసారు. రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఇలాంటి మరక గతంలో ఎన్నడూ లేదు. ఇలా జరగడం పట్ల అన్నయ్య శివ రాజ్ కుమార్ కూడా సీరియస్ గా ఉన్నారు.

ఇంతా చేసి అంజని పుత్ర అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. భారీ ఓపెనింగ్స్ వచ్చినా నెగటివ్ టాక్ తో ఫైనల్ గా ఫ్లాప్ గా మిగిలేలా ఉంది. అందుకే అందినకాడికి ఓపెనింగ్స్ రూపంలో సాధ్యమైనంత వెనక్కు రాబట్టుకుందాం అని ట్రై చేస్తున్న నిర్మాతకు కోర్ట్ ఆర్డర్స్ అడ్డంకిగా మారాయి. ఈ అంజని పుత్ర కథలో ఏముంది అనుకుంటున్నారా. ఓ మూడేళ్ళ క్రితం విశాల్ హీరోగా పూజా అనే సినిమా ఒకటి వచ్చింది. గుర్తుందిగా. దాని రీమేకే ఈ అంజని పుత్ర. అందులో రాధిక చేసిన పాత్ర ఇందులో రమ్యకృష్ణ చేసింది. రష్మిక మండన్న హీరొయిన్. ఫుల్ మాస్ మసాలా సినిమాగా తీసిన ఈ మూవీలో అనవసరంగా లా సిస్టం పై విసుర్లు వేసారని వివాదం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికైతే పునీత్ సైలెంట్ గా ఉన్నాడు. లాయర్లు డిమాండ్ చేసినట్టు సారీ చెబుతాడో లేదో చూడాలి.