Begin typing your search above and press return to search.
కథ విని త్రివిక్రమ్ అలా అన్నారట!
By: Tupaki Desk | 30 Sep 2022 2:30 AM GMTఅక్టోబర్ 5న దసరా సందర్భంగా రెండు భారీ క్రేజీ సినిమాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'తో బరిలోకి దిగుతున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చిరు తొలిసారి హీరోయిన్, డ్యూయెట్స్ లేకుండా పవర్ ఫుల్ పాత్రలో గాడ్ ఫాదర్ గా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సంచలనంగా నిలిచి సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇక ఈ మూవీతో పాటు అక్టోబర్ 5న కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'ది ఘోస్ట్' రిలీజ్ కాబోతోంది.
ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచే సినిమాపై అంచనాల్నిపెంచేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత హైకి చేరుకున్నాయి. ఈ రెండు భారీ సినిమాలతో చిన్న సినిమా 'స్వాతిముత్యం' కూడా రిలీజ్ అవుతోంది. బెల్లంకొండ గణేష్ ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండటంతో ఈ మూవీపై కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ ని ముందు త్రివిక్రమ్ కి వినిపించారట.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలకు త్రివిక్రమ్ ఎంత చెబితే అంత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తుంటారు ఆ కారణంగానే ఆ బ్యానర్ కేవలం త్రివిక్రమ్ తో మాత్రమే సినిమాలు చేస్తుంటుంది.
ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ బయటి హీరోల సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సంస్థల్లో ఏ సినిమా రావాలన్నా త్రివిక్రమ్ డిసైడ్ చేయాల్సిందే. ఆ కారణంగానే త్రివిక్రమ్ కు సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన 'స్వాతిముత్యం' కథని ముందుగా త్రివిక్రమ్ కు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ వినిపించారట. ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు. 'నేను త్రివిక్రమ్ కి వీరాభిమానని. ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. 'అతడు' సినిమా తనపై బలంగా ప్రభావాన్ని చూపించిందని, ఆ కారణంగానే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పుకొచ్చాడు.
ఇక తొలి అవకాశం సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో రావడంతో కథని త్రివిక్రమ్ కు నెరేట్ చేశాడట. కథ విన్న ఆయన కథ చక్కగా రాశావు.. నేను కరెక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రెష్ గా వుంది.. సెట్స్ పైకి వెళ్లిపోవచ్చు' అని చెప్పారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాకే ఈ మూవీ పట్టాలెక్కిందని చెప్నుకొచ్చాడు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ. 'స్వాతిముత్యం' అక్టోబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.