Begin typing your search above and press return to search.

వాట్ ఈజ్ దిస్ అనేది..ఆ సినిమాతో తెలుస్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   21 Feb 2019 9:43 AM GMT
వాట్ ఈజ్ దిస్ అనేది..ఆ సినిమాతో తెలుస్తుంద‌ట‌!
X
టైం బాగోన‌ప్పుడు టెంకాయి సైతం టైం బాంబ్ మాదిరి పేలుతుంద‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే.. తెలుగు రాజ‌కీయాల్ని అధ‌మ స్థాయికి దిగ‌జార్చిన చంద్ర‌బాబుకు ఇప్పుడు చోటు చేసుకుంటున్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం అంత‌కంత‌కూ ఇబ్బందిక‌రంగా మారుతోంది. ఓప‌క్క పార్టీ నేత‌లు ఎవ‌రికి వారు ఫ‌లానా కార‌ణం అన్న‌ది చెప్ప‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌టం.. మ‌రోవైపు త‌న పాపాన్ని కంటికి క‌ట్టిన‌ట్లుగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వ‌ర్మ చూపిస్తున్న వైనం.. మ‌రోవైపు ముంచుకొస్తున్న ఎన్నిక‌లు..ఇంకోవైపు నుంచి కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్.. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు న‌లువైపుల నుంచి బాబుకు స‌వాళ్లు ఎదుర‌వుతున్న దుస్థితి.

వీట‌న్నింటికి మించి మోడీ డేగ క‌ళ్ల నుంచి బాబు త‌ప్పించుకోలేర‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇలా.. ప్ర‌తి విష‌య‌మూ త‌న‌కు ప్ర‌తికూలంగా మారుతున్న వేళ‌.. ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి తాజాగా గ‌ళం విప్పారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని చూడొద్దంటూ చంద్ర‌బాబు చెప్ప‌టం ఏమిటంటూ ఆమె సూటిగా ప్ర‌శ్నించారు.

తాజాగా నిర్వ‌హించిన టెలీ కాన్ఫ‌రెన్స్ లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ప్ర‌స్తావ‌న రావ‌టం.. దాన్ని చూడొద్ద‌న్న రీతిలో బాబు వ్యాఖ్యానించిన‌ట్లుగా వార్త‌లు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మాట్లాడిన ల‌క్ష్మీ పార్వ‌తి.. పార్టీ నేత‌లు ఏ సినిమా చూడాలో కూడా చంద్ర‌బాబే డిసైడ్ చేస్తారా? అని సూటిగా ప్ర‌శ్నించారు.

ఏ సినిమా చూడాలో కూడా బాబే చెప్ప‌టం.. ఆయ‌న దిగ‌జారినత‌నానికి ప్ర‌తిరూపంగా దుయ్య‌బ‌ట్టిన ల‌క్ష్మీ పార్వ‌తి.. వాస్త‌వాలు ఉన్నాయి క‌నుక‌నే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే బాబుకు భ‌యంగా ఆమె అభివ‌ర్ణించారు. బాల‌కృష్ణ తీసిన బ‌యోపిక్ అర్థ‌మే మార్చేశార‌న్నారు. అందుకే ఆ సినిమాను ప్ర‌జ‌లు ఆద‌రించ‌లేద‌న్నారు.

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ధైర్యంగా.. నిజాయితీగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా అస‌లు విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తెస్తున్నార‌ని.. ఆయ‌న‌కు ఎలా థ్యాంక్స్ చెప్పాలో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌న్నారు. ఇన్నాళ్ల‌కు బాబు పాపం పండింద‌ని.. ల‌క్ష్మీస్ సినిమా ద్వారా నిజాలు బ‌య‌ట‌కు రానున్న‌ట్లు చెప్పారు.

ఇంత‌కాలం వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేసిన చంద్ర‌బాబు పాపం పండింద‌న్నారు. బాబు చేసిన పాపాల‌న్నీ న‌లు వైపుల నుంచి కారుమేఘాల్లా క‌మ్ముకొస్తున్నాయ‌న్నారు. త‌న‌నపై ఆకార‌ణంగా నింద‌లు వేసి.. అవాస్త‌వాలు ప్ర‌చారం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన ల‌క్ష్మీ పార్వ‌తి.. చ‌రిత్ర‌ను దిక్కు మొక్కు లేకుండా చేయాల‌ని చూసిన బాబు దుర్మార్గం ఇన్నాళ్ల‌కు ల‌క్ష్మీస్ఎన్టీఆర్ రూపంలో బ‌య‌ట‌కు రానుంద‌న్నారు. ల‌క్ష్మీ పార్వ‌తి మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు చంద్ర‌బాబుకు ప్ర‌తికూలంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.