Begin typing your search above and press return to search.

రాశి పోసిన సౌందర్య 'లక్ష్మీ'

By:  Tupaki Desk   |   20 Dec 2016 9:30 AM GMT
రాశి పోసిన సౌందర్య లక్ష్మీ
X
తమిళ్ మలయాళ భాషల్లో హీరోయిన్ వేషాలు దండిగానే ఉన్నా.. తెలుగులో ఎక్కువగా ఐటెం సాంగ్స్ తోనే పాపులర్ అయింది రాయ్ లక్ష్మీ. కాంచన మూవీలో హీరోయిన్ గా అలరించినా.. ఆ తర్వాత మాత్రం మనోళ్లు ఐటెంగానే చూశారు ఈ పాపను. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పక్కన తోబ తోబ అంటూ.. మెగాభిమానులను తెగ ఊరించేసింన ఈ భామ.. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150లోనూ ఐటెం సాంగ్ చేసి అదరగొట్టేసింది.

ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ జూలీ2లో నటిస్తూ కెరీర్ ని పరుగులు పెట్టించే పనిలో ఉన్న రాయ్ లక్ష్మి... రీసెంట్ గా స్టార్ డస్ట్ అవార్డ్స్ కార్యక్రమంలో మెరిసిపోయింది. అమ్మడి డ్రెసింగ్ స్టైల్ చూసి చాలా మందికి నోట మాట రాలేదు సరికదా.. లొట్టలేసుకోవాల్సి వచ్చిందట. నీటుగా తల దువ్వు మధ్యపాపిట తీసి పద్ధతిగా కనిపించిన ఈ వయ్యారి.. మెడ వంపుల నుంచి అసలు స్టైలింగ్ మొదలుపెట్టింది. సౌందర్యం మొత్తాన్ని ఒక రాశి పోసి రూపం ఇస్తే ఎలా ఉంటుందో... అంతటి సౌందర్య లక్ష్మిలా కనిపించేసింది లక్ష్మీ రాయ్.

భుజాల దగ్గర ఫెదర్ టచింగ్ ఇచ్చిన రాయ్ లక్ష్మీ.. బ్లాక్ డ్రస్ కి ట్రాన్స్ పరెంట్ ఫినిషింగ్ ఇచ్చి.. ఆ మధ్యలోంచి క్లీవేజ్ అందాలను ప్రదర్శనకు పెట్టేసింది. వీటన్నిటికీ తోడు స్లీవ్ లెస్ టాప్. ఐటెం పాపగా చేస్తూనేఇంతగా రెచ్చిపోతుంటే.. రేపు జూలీ2లో ఏ స్థాయిలో శృతి మించుతుందో అనుకుంటున్నారు అభిమానులు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/