Begin typing your search above and press return to search.

అయ్యో!! బూతు అనుకున్నారట

By:  Tupaki Desk   |   30 Nov 2017 11:22 AM IST
అయ్యో!! బూతు అనుకున్నారట
X
రాయ్ లక్ష్మి ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న మూవీ జూలీ2. ఆమె కెరీర్ లో ఇది 50వ సినిమా కావడం.. అదే చిత్రం ఈ భామకు బాలీవుడ్ లో లాంఛింగ్ మూవీ కావడంతో చాలానే హోప్స్ పెట్టుకుంది. కానీ అవేవీ నెరవేరలేదు. అటు క్రిటిక్స్ నుంచి ఇటు జనాల వరకూ జూలీ2ని ఏకి పడేశారు. ఓవరాల్ గా సినిమా ఫ్లాప్ అనే సంగతి ఖాయమైపోయింది.

ఇప్పుడు తీరిగ్గా సినిమాను జనాలు మెచ్చకపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారు యూనిట్. జూలీ2 చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైందని దర్శకుడు దీపక్ శివదాసాని ఒప్పుకోవడం అంతో ఇంతో ప్రశంసించాల్సిన విషయం. రాయ్ లక్ష్మి అయితే రీజన్స్ కూడా చెప్పేస్తోంది. 'జనాలు ఈ చిత్రాన్ని సెక్స్ సినిమా అనుకున్నారు. కానీ జూలీ2 మూవీలో అలాంటి కంటెంట్ ఏమీ ఉండదు. అసలు ఈ మూవీకి ప్రమోషన్ కూడా అలాగే చేశారు. మొదటగా రిలీజ్ చేసిన టీజర్ కూడా అదే తరహా ఇండికేషన్స్ ఇచ్చింది కదా' అని చెప్పిన రాయ్ లక్ష్మి.. సినిమాకి ప్రశంసలు కాకుండా విమర్శలు వచ్చిన విషయాన్ని కూడా ఒప్పుకుంది.

తనకు ఇదో లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అంటున్న రాయ్ లక్ష్మి.. జూలీ2 కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. తన ట్యాలెంట్ మళ్లీ తనకు అవకాశాలు తెచ్చిపెడుతుందని నమ్మకం వెలిబుచ్చింది. ఈ ఫ్లాప్ నుంచి కోలుకుని తన తర్వాతి చిత్రాల షూటింగ్ లో బిజీ కానున్నట్లు కాసింత తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం ప్రదర్శిస్తూ చెప్పింది రాయ్ లక్ష్మి.