Begin typing your search above and press return to search.
వామ్మో.. రంగీలాని మించిపోయిన రత్తాలు
By: Tupaki Desk | 19 Jan 2017 4:44 PM GMTరెండు దశాబ్దాల క్రితం రంగీలా అంటూ ఊర్మిళతో రామ్ గోపాల్ వర్మ తీసిన ఓ మూవీ బ్లాక్ బస్టర్. ఆ సినిమాలో ఆమిర్ ఖాన్.. జాకీ ష్రాఫ్ లాంటి దిగ్గజాలున్నా అందరి దృష్టి ఊర్మిళపైనే పడుతుంది. అంతలా ఎక్స్ పోజింగ్ తో కుమ్మేసింది ఊర్మిళ. ఆ తర్వాత కూడా బాలీవుడ్ లో చాలానే బోల్డ్ సినిమాలు వచ్చాయి కానీ.. మరీ ఆ స్థాయిలో ఎవరూ పోటీ పడలేకపోయారు.
ఇప్పుడు ఖైదీ నంబర్ 150 ఐటెం బ్యూటీ రత్తాలు అలియాస్ రాయ్ లక్ష్మి అంతకు మించి రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది. జూలీ2 అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్న రాయ్ లక్ష్మి.. ఈ చిత్రం కోసం చాలానే చిక్కిపోయింది. మెరుపుతీగలా మారిపోవడమే మారిపోవడమే కాదు.. సొగసుల కొలతలు కూడా బాగా పెంచుకుంది. వీటిన్నిటినీ కలిపి జూలీ2లో చూపించేస్తోంది రాయ్ లక్ష్మి. అర కొర పీలికల్లాంటి దుస్తులతో తెగ రెచ్చగొట్టేస్తోంది. గ్లామర్ డోస్ కంటే.. దాన్ని ప్రెజెంట్ చేస్తున్న తీరు ఇంకా అద్భుతంగా ఉండడంతో.. రాయ్ లక్ష్మి ఓ మోడ్రన్ అప్సరసలా కనిపించేస్తోంది.
బాలీవుడ్ మూవీ కోసం ఇంతగా కష్టపడిపోతున్న రాయ్ లక్ష్మికి.. జూలీ2 ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందనే ఆసక్తి నెలకొంది. క్లిక్ అయితే మాత్రం.. అక్కడ పాగా వేసేసినట్లే అని చెప్పాలి.