Begin typing your search above and press return to search.
మంచి సినిమాను బూతు పేరుతో చంపేశారు
By: Tupaki Desk | 19 Feb 2019 3:30 PM GMTదక్షిణాదిలో హాట్ బ్యూటీగా అలరించిన రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో 'జూలీ 2' చిత్రంతో అలరించే ప్రయత్నం చేసింది. జూలీ 2 చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న రాయ్ లక్ష్మికి తీవ్ర నిరాశే మిగిలింది. బాలీవుడ్ లో 'జూలీ 2' ద్వారా సెటిల్ అవ్వాలనుకుంది. కాని ఈమె ఆశలు రివర్స్ అయ్యాయి. దాంతో మళ్లీ సౌత్ లోనే ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
తన బాలీవుడ్ మూవీ 'జూలీ 2' ఫ్లాప్ కు నిర్మాతలే కారణం అంటూ చెప్పుకొచ్చింది. సినిమాను ఒక బూతు కంటెంట్ మూవీలా వారు ప్రమోట్ చేయాలనుకున్నారు. అలా చేయడం వల్ల యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవచ్చని వారు భావించారు. ట్రైలర్ మరియు టీజర్ లలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. కాని సినిమాలో ఆ కంటెంట్ లేకపోవడంతో ఒక వర్గం ప్రేక్షకులు నిరాశ చెందారని - ఫ్యామిలీ ఆడియన్స్ ఇదొక అడల్ట్ సినిమా అనే ఉద్దేశ్యంతో దూరంగా ఉన్నారని రాయ్ లక్ష్మి చెప్పుకొచ్చింది.
'జూలీ 2'ను ఒక బూతు సినిమా తరహాలో కాకుండా రెగ్యులర్ సినిమా మాదిరిగా ప్రమోషన్ చేసి ఉంటే తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు మూవీ నచ్చేదని - పబ్లిసిటీలో ప్రయోగాత్మకత పేరుతో నిర్మాతలు సినిమాను చంపేశారని రాయ్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలో నటించడం వరకే హీరోయిన్ పని - పబ్లిసిటీ అంతా కూడా నిర్మాత దర్శకులు చూసుకుంటారు. జూలీ 2 పబ్లిసిటీలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. కాని జూలీ 2 ఫ్లాప్ నన్ను తీవ్రంగా నిరాశ పర్చింది. కష్టపడి చేసిన సినిమాను బూతు సినిమాగా పబ్లిసిటీ చేయడంతో ప్రేక్షకులు తిరష్కరించారంది.