Begin typing your search above and press return to search.

పవన్ తో పని చేసి కబుర్లు నేర్చింది

By:  Tupaki Desk   |   26 Jan 2016 4:10 AM GMT
పవన్ తో పని చేసి కబుర్లు నేర్చింది
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఎంపికైనప్పటి నుంచి రాయ్ లక్ష్మీ రాతే మారిపోయింది. అంతకు ముందు కూడా వరుస సినిమాలు చేసినా, పవన్ తో ఛాన్స్ తర్వాత క్రేజీ ప్రాజెక్టులు ఆమెను పలకరిస్తున్నాయి. ఈ ఏడాది రాయ్ లక్ష్మీ కెరీర్ లో చాలా కీలకం అని చెప్పాల్సిందే. ఎందుకంటే పవర్ స్టార్ తో చేసిన సర్దార్ తో పాటు బెంగళూర్ డేస్ రీమేక్, జూలీ2 చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

పవన్ తో పని చేయడమంటే, ఓ పర్ఫెక్షనిస్ట్ ని పక్కన పెట్టుకుని వర్క్ చేయడమే. మరి అలాంటి వాడితో మూవీ చేసేటప్పుడు ఆటోమేటిగ్గా కొన్ని తెలివితేటలు అబ్బుతుంటాయి. అలా పవన్ నుంచి నేర్చుకున్న వాటిలో కొన్నింటిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది రాయ్ లక్ష్మీ. రీసెంట్ తన క్లీవేజ్ ని ప్రదర్శిస్తూ, తనను తాను సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా ఓ పోజ్ ఇచ్చి ఫోటో దిగింది. దీన్ని సోషల్ సైట్లలో పోస్ట్ చేసి, ఓ కోట్ కూడా కూడా పెట్టింది.

'మనసు గుడ్డిది అయినపుడు కళ్లకు పని ఉండదు' ఇదీ అమ్మడి కొటేషన్. అంటే ఆస్వాదించే మనసు లేకపోతే.. కళ్లకు పెద్దగా పని పెట్టాల్సిన పనిలేదన్నది రాయ్ లక్ష్మీ భావం కావచ్చు. ఇది వేదాంతంలా అనిపిస్తున్నా.. తాను చూపిస్తున్న గ్లామర్ ని చూడలేనివాళ్లకు మనసు లేనట్లే అన్నది అమ్మడి అసలు అర్ధం. ఇంత చిన్న కొటేషన్ లో ఎన్ని అర్ధాలను మిక్స్ చేసిందో చూశారా? మొత్తానికి పవన్ తో పని చేసి బాగానే మాటలు నేర్చింది ఈ భామ. ఒక ఐటెం సాంగ్ కే ఇన్ని మాటలొస్తే, ఇక ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తే.. గ్రంథాలు రాసేస్తుందేమో!