Begin typing your search above and press return to search.

ఈ బట్టలకే గొడవ వచ్చేసిందా??

By:  Tupaki Desk   |   18 Oct 2016 5:22 PM GMT
ఈ బట్టలకే గొడవ వచ్చేసిందా??
X
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా లక్ష్మీ రాయ్ రచ్చ ఎక్కువైపోయింది. ఎలాగైతే అమ్మడు ''సర్దార్ గబ్బర్ సింగ్'' టైములో తాను చేసే ఐటెం సాంగు తాలూకు ఫోటోలను రిలీజ్ చేసేసి తౌబా తౌబా అంటూ కుర్రాళ్లను మెలికలు తిప్పించేసిందో.. ఇప్పుడు సేమ్ ''ఖైదీ నెం 150'' విషయంలో కూడా అదే ప్యాట్రన్ ఫాలో అయిపోతోంది. ఫోటోలు మీద ఫోటోలు షేర్ చేస్తూ తెగ ఆనందపడుతోంది.

నార్త్ సైడ్ అయితే గాగ్రాచోళీ అంటారు.. మనోళ్ళు అయితే లంగా జాకెట్ అంటారు. సింపుల్ గా లక్ష్మీ రాయ్ కోసం ఈ పాటలో వేసిన డ్రస్ అదే. చూస్తున్నారు.. పింక్ రంగు జాకెట్లో ఎన్ని రకాల హంగులు అద్దారో. అదే విధంగా క్రింద వేసుకునే స్కర్టుకు కూడా చమీచమ్కీల పువ్వల డిజైన్లతో మిరుమిట్లు గొలిపేలా డిజైన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఈ డిజైన్లను చేసింది. అసలు ఈ బట్టల్లో ఏం ప్రాబ్లం ఉందని.. క్యాథరీన్ త్రెసా వీటిని వేస్కోను అని అలిగింది?

నిజానికి క్యాథరీన్ కనుక ఈ బట్టల గురించే వాకౌట్ చేసుంటే.. అసలు ఆమెకు ఈ బట్టలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలియాల్సిందే. లేకపోతే అంత అందంగా.. చాలా స్టయిలిష్‌ లుక్కులో ఉన్న ఈ బట్లల్లో క్యాథరీన్ ఎంతా బాగా మెరిసిపోయి ఉండేదో. మరి ఇలాంటి బట్టల గురించి గొడవపడటం అంటే మాత్రం అది ఆలోచించాల్సిన విషయమే. వీటిలో పోనివ్ ఏమన్నా అశ్లీలత ఉట్టిపడుతోందా అంటే అది కూడా లేదాయే. వాట్ క్యాథరీన్.. ఏమంటావ్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/