Begin typing your search above and press return to search.
జిమ్ లో పొగలొచ్చాయేంటి లక్ష్మీ..
By: Tupaki Desk | 9 Feb 2019 8:18 AM GMTగత కొంతకాలంగా రాయ్ లక్ష్మీ ప్రచారార్భాటం గురించి తెలిసిందే. సెన్సేషన్స్ కి ఏమాత్రం ఆస్కారం ఉన్నా అస్సలు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఈ అమ్మడి క్రేజు అంతకంతకు పెరుగుతోంది. ఇన్ స్టా, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను అప్ లోడ్ చేస్తూ రాయ్ లక్ష్మీ అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇటీవల దిశా పటానీ కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల ప్రకటన సక్సెసవ్వడం, అటుపై టైట్ ఫిట్ జిమ్ వేర్ లుక్ కి యూత్ లో ఆదరణ దక్కడంతో రాయ్ లక్ష్మీ ఆ దిశగా హాట్ కంటెంట్ ని పెంచేసి ప్రచారానికి పెడుతోంది. ఎవ్వర్ లేటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
తాజాగా ఈ బ్యూటీ కొన్ని వేడెక్కించే ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. జిమ్ లో కసరత్తులు చేస్తూ ఓ ప్రత్యేకమైన ఆసనంలో కూచుని ఉంది. జిమ్ ప్లస్ యోగా ఫార్ములాని కనిపెట్టింది. ఒకేసారి జిమ్ చేస్తూ యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఇలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు యూత్ లో అంతకంతకు వేడి పెంచుతున్నాయి. సెలబ్రిటీల రెగ్యులర్ జిమ్ యాక్టివిటీస్ ఇలా సామాజిక మాధ్యమాల్లోకి వస్తే అవి అంతే జోరుగా వైరల్ అయిపోతుండడంతో ఈ కొత్త ఎత్తుగడ తనకి బాగానే ప్రచారం తెచ్చిపెడుతోంది.
ఇంతకీ రాయ్ లక్ష్మీ కెరీర్ సంగతేంటి? అని ప్రశ్నిస్తే హడావుడి ఎక్కువ అసలు తక్కువ! అన్నట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ `ఖైదీనంబర్ 150`లో రత్తాలుగా రఫ్ఫాడించిన రాయ్ లక్ష్మీకి ఐటెమ్ భామగా మరిన్ని ఛాన్సులు వెంటపడ్డాయి కానీ పూర్తి స్థాయి నాయికగా పెద్దగా వెలిగిపోయిందేమీ లేదు. వరలక్ష్మి, కేథరిన్ లతో కలిసి `నాగకన్య` అనే ఓ ప్రయోగాత్మక గ్రాఫిక్స్ చిత్రంలో నటిస్తోంది. `ఒరు కుట్టదు బ్లాక్` అనే మలయాళ చిత్రం లో నటించింది. `సైరా- నరసింహారెడ్డి`లో ఓ పాత్రకు ఎంపికైందని వార్తలు వచ్చినా అవేవీ కన్ఫామ్ కాలేదు. జూలీ 2 తర్వాత హిందీలోనూ ఛాన్సులేవీ రాలేదు. అయితే తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ కొత్తగా ప్రయత్నాలు సాగిస్తోందిట. రెగ్యులర్ జిమ్ లుక్ తో ఇలా వేడి పెంచేస్తే మన దర్శక నిర్మాతలు ఛాన్సులిచ్చేస్తారంటారా?
మరిన్ని పిక్స్ కోసం క్లిక్ చేయండి