Begin typing your search above and press return to search.
మామిడికాయ తిన్నా వదల్లేదు: లక్ష్మిరాయ్ ఆవేదన
By: Tupaki Desk | 24 Feb 2019 7:30 AM GMTహీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన లక్ష్మీ రాయ్ కెరీర్ ఆరంభం నుండే అందాల ఆరబోత చేసినా కూడా ఆమెకు నిరాశజనకమైన ఫలితాలు నమోదు అయ్యాయి. కెరీర్ లో ఎక్కువ శాతం ఫ్లాప్ లు వచ్చినా కూడా ప్రయత్నాలు మాత్రం మానలేదు. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా సినిమాలు చేసింది. అయితే ఎక్కడ కూడా ఈమెకు కలిసి రాలేదు. పేరు మార్చుకుంటే అయినా లక్ కలిసి వస్తుందని లక్ష్మీ రాయ్ పేరును కాస్త రాయ్ లక్ష్మీగా మార్చుకుంది. అయినా కూడా ప్రయోజనం లేదు. అదే సమయంలో ఆమెపై ఎప్పటికప్పుడు ఏదో ఒక పుకారు మీడియాలో షికారు చేస్తూనే ఉండేది.
టీం ఇండియా సంచలన ఎంఎస్ ధోనీతో ఈమెకు ప్రేమ వ్యవహారం ఉందని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని పదే పదే ఆమె ఖండించడం జరిగింది. ధోనితో ఉన్న పరిచయంతో ఇండస్ట్రీలో రాణించేందుకు ఆమె ప్రయత్నించింది. కాని అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చాలా చాలా పుకార్లు ఈమె గురించి వచ్చాయి. తాజాగా లక్ష్మీరాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ మొత్తం కూడా పుకార్లను ఎదుర్కొంటూనే ఉన్నాను. నా ప్రతి కదలికను కూడా కొందరు తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు.
ఒక సినిమా షూటింగ్ సందర్బంగా మామిడి కాయ తింటూ ఉండటంను కొందరు చూసి నన్ను గర్బవతి అంటూ ప్రచారం చేశారు. అలా ఎన్నో రకాలుగా నా ప్రమేయం లేకుండానే పుకార్లకు నేను బలి అయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాను అని, నేను నమ్మినంత విధంగా అవతలి వారు నమ్మక పోవడంతో బ్రేకప్స్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ప్రేమ విషయంలో మళ్లీ మళ్లీ మోసపోవాలని తాను భావించడం లేదని, ప్రస్తుతానికి తాను సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది. ఈమె ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రంలో నటించడంతో పాటు రెండు మూడు ఐటెం సాంగ్స్ కు ఓకే చెప్పింది.