Begin typing your search above and press return to search.

మెగా గయ్యాళితో వర్మ ఫైట్

By:  Tupaki Desk   |   26 March 2019 6:48 AM GMT
మెగా గయ్యాళితో వర్మ ఫైట్
X
అసలైన అడ్డంకిగా ఫీలైన సెన్సార్ గండాన్ని ఊహించిన దాని కన్నా ఈజీగా పరిష్కరించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ . ఇక 29న విడుదలకు రూట్ క్లియర్ అయినట్టే. ఇంకా ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు రావాలని చెబుతున్నారు కాని మరోపక్క హైదరాబాద్ కు సంబంధించి మెయిన్ థియేటర్ సంధ్యలో ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలైపోయింది. సో డిస్ట్రిబ్యూటర్లు పక్కా సమాచారంతో ఫిక్స్ చేసి చెప్పెశారన్న మాట.

వివాదాల నేపధ్యంలో మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తోంది వర్మ టీం. ఇది ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత కథ కాకుంటే దీనికి మినిమం బజ్ కూడా వచ్చి ఉండేది కాదన్న మాట నిజం. ఇప్పుడు వర్మ సోలోగా బరిలో దిగడం లేదు. మెగా డాటర్ నీహారిక సూర్యకాంతం అదే రోజు వస్తోంది. దీనికీ భీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చే సీన్ అయితే లేదు కాని టాక్ పాజిటివ్ గా వస్తే డ్రై గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు కొంత ఉత్సాహం వస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపించడం కొంత ఊరట కలిగించే విషయం.

అయితే ఒకదాని మీద మరొకటి లక్ష్మీస్ ఎన్టీఆర్ సూర్యకాంతంల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలే ఎన్నికల సీజన్. ఊళ్లకూళ్ళూ రాజకీయ పార్టీల ప్రచారాలతో హోరెత్తిపోతున్నాయి. థియేటర్లు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ రెండు కొద్దోగొప్పో మెప్పిస్తే మళ్ళి టికెట్ కౌంటర్ కళకళలాడుతాయని ట్రేడ్ ఆశ. ఎలాగూ ఏప్రిల్ 5 నుంచి మజిలితో మొదలయ్యే వరస సినిమాల తాకిడికి ఈ రెండు రిబ్బన్ కటింగ్ లా ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. చూద్దాం ఎవరు నిలుస్తారో.