Begin typing your search above and press return to search.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంకా అమ్మనేలేదట
By: Tupaki Desk | 28 Feb 2019 7:46 AM GMTఎన్టీఆర్ మహానాయకుడు దెబ్బ గట్టిగా తగిలిన తర్వాత అందరి చూపు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ వైపే ఉంది . ఆఫీసర్ లాంటి ఎవర్ గ్రీన్ డిజాస్టర్ తర్వాత వర్మ సినిమాకు ఇంత హైప్ రావడం ఎవరూ ఊహించనిది. పబ్లిసిటీ చేసుకోవడంలో తనను మించిన తోపు లేరని మరోసారి ప్రూవ్ చేసుకున్న వర్మ దీని రిలీజ్ డేట్ మాత్రం ఎంతకీ చెప్పడం లేదు.
నిన్నటి నుంచి ఎవరో డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను 9 కోట్లకు కొన్నారన్న వార్త కాస్త గట్టిగానే షికారు చేసింది. దీనికి వర్మ స్పందించాడు. అసలు సినిమా ఎవరికీ అమ్మనే లేదని నిర్మాతలైన తాను జివి ఫిలిమ్స్ రాకేశ్ రెడ్డి సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని చెప్పాడు. బయ్యర్ల పేర్లు కూడా అప్పుడే చెబుతారట. సో ఇప్పటిదాకా వచ్చిన బిజినెస్ వార్తలన్నీ కొట్టిపారేశాడు వర్మ
ఎన్నికల నోటిఫికేషన్ తేది రేపో ఎల్లుండో అనే పరిస్థితి నెలకొని ఉండగా అసలు వర్మకు ఎలక్షన్స్ లోపు సినిమా విడుదల చేసే ఉద్దేశం ఉందో లేదో అర్థం కావడం లేదు. కోడ్ అమలులోకి వచ్చాక లక్ష్మీస్ ఎన్టీఆర్ కు విడుదల పరంగా చిక్కులు వచ్చే అవకాశం లేకపోలేదు. సినిమాను అమ్ముతాం అంటున్నాడు కాబట్టి ఒకవేళ ఏదైనా అడ్డంకి వస్తే డిజిటల్ ప్లాట్ఫార్మ్ మీద విడుదల చేసే అవకశాన్ని కొట్టి పారేయలేం.
ఒకవేళ పూర్తి వాయిదా వేసి ఏ మేనో జూనో అన్నా ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడీ సినిమాను అమ్మి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి విడుదలకు డేట్ ఫిక్స్ చేయడం ఇలా చాలా పనులే పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్ని కొలిక్కి తెచ్చి ఎప్పుడు విడుదల చేస్తాడో వేచి చూడాలి మరి