Begin typing your search above and press return to search.
#లక్ష్మీ బాంబ్.. ఈ రికార్డ్ కూడా కిలాడీ ఖాతాలోకేనా?
By: Tupaki Desk | 30 Sep 2020 5:30 PM GMTభారతీయ సినీ చరిత్రలో ఇదో అరుదైన రికార్డ్. ఒకేసారి రెండు ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ అవుతున్న సినిమాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న `లక్ష్మీ బాంబ్` సరికొత్త రికార్డులకెక్కబోతోంది. తెలుగు..., తమిళ భాషల్లో రాఘవ లారెన్స్ నటించి తెరకెక్కించిన `కాంచన` చిత్రాన్ని `లక్ష్మీబాంబ్` పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ 9న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతోంది.
ఇండియాలో తొలి భారీ డిజిటల్ మూవీగా నిలవబోతోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ తో పాటు అటు థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. దేశీయంగా థియేట్రికల్ రిలీజ్ లేకపోయినా.. ఓవర్సీస్ లో ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో విడుదలవుతోంది. ఆస్ట్రేలియా- న్యూజిలాండ్- యుఎఈలలో రిలీజ్ కాబోతోంది.
వరల్డ్ లో కరోనా వైరస్ ప్రభావం చూపని ప్రదేశాలుగా ఈ దేశాలు నిలిచాయి. దీంతో అక్కడ థియేటర్లలో `లక్ష్మీ బాంబ్` రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారు. బయటకు వచ్చిన పోస్టర్లను బట్టి ఈ మూవీ హర్రర్ - కామెడీ అంశాలతో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కాలంలో భారతీయ చిత్రానికి తొలి థియేట్రికల్ రిలీజ్ కావడంతో ఓవర్సీస్ రిలీజ్ ఆసక్తిగా మారింది. దేశంలోనే వరుస బ్లాక్ బస్టర్లతో సంచలనం సృష్టించి ఫోర్బ్స్ జాబితాలో ఖాన్ లనే వెనక్కి నెట్టేస్తున్న అక్షయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు పడుతుండడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేవు మరి.