Begin typing your search above and press return to search.

భరత్ కు మిగిలిన సిఎంలకు తేడా

By:  Tupaki Desk   |   1 April 2018 12:19 PM IST
భరత్ కు మిగిలిన సిఎంలకు తేడా
X
మహేష్ బాబు క్రేజీ మూవీ భరత్ అనే నేను విడుదలకు సరిగ్గా 19 రోజులు మాత్రమే టైం ఉంది. ఇవి ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా అని అభిమానులు అంకెలు లెక్కబెట్టుకుంటున్నారు. ఆడియోలో ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా పూర్తి ఆల్బం కోసం ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి దాకా వదిలిన పోస్టర్స్ లో మహేష్ బాబు ఒక్కడే ఉండగా నిన్న వదిలిన లేటెస్ట్ స్టిల్ లో హీరొయిన్ కైరా అద్వానిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో మహేష్ ఎప్పటి లాగా కూల్ లుక్ తో సూపర్ అనిపిస్తే కైరా కూడా భళిరా అనిపించుకుంది. కాని ఇలాంటి స్టిల్ గతంలో చూసామే అనే అనుమానం మాత్రం కొందరు అభిమానులు వ్యక్తం చేసారు. గతంలో హీరో సిఎం పాత్రలో కనిపించే సినిమాలో రానా లీడర్ వచ్చింది. అందులో రానా, మెయిన్ హీరొయిన్ రిచా గంగోపాధ్యాయ మధ్య కూడా ఇలాంటి బాడీ లాంగ్వేజే ఉంటుంది. సో పోలిక రావడం సహజం.

కాని ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. మహేష్ ఇందులో చేస్తోంది ఊర మాస్ మసాలా హీరో పాత్ర కాదు. హుందాగా ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్య మంత్రి పాత్ర. కాబట్టి సహజంగానే ఆ కాన్వాయ్ ఆర్భాటం ఎలా తీసినా ఇవన్ని ఉండాల్సిందే. కాబట్టి ఇలా ప్రెజెంట్ చేయటం తప్ప కొరటాల శివ కు మరో ఆప్షన్ ఉంటుంది అనుకోలేం. శంకర్ తీసిన ఒకే ఒక్కడులో కూడా అర్జున్ సరసన మనీష కోయిరాలాతో స్కిన్ షో చేయకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. సో భరత్ అనే నేను లుక్ కాస్త పోలిక తీసుకొచ్చినా హీరో పాత్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ పరిమితులు తప్పవు. కాకపోతే లీడర్ లో రిచా మాదిరే కైరా సన్నగా ఉండటం దీనికి ఊతమిచ్చింది అంతే.

హీరోలు సిఎంలా నటించిన సినిమాలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి అందులో మహేష్ లాంటి స్టార్ హీరో చేస్తే దాని స్టేచర్ వేరుగా ఉంటుంది కాబట్టి భరత్ అనే నేనుకి ఇంత హైప్ వస్తోంది. మరి అందులో ప్రజలకు హామీ ఇచ్చినట్టే ఈ సారి హిట్ కొడతాను అని ఫాన్స్ కు కూడా భరోసా ఇచ్చిన భరత్ భారీ వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ ఎన్నికలు గెలవాల్సి ఉంది. అది తెలియాలంటే మూడు వారాలు ఆగితే సరి