Begin typing your search above and press return to search.
ప్రేమమ్ సినిమాలో ఫీల్ కట్ అయ్యింది
By: Tupaki Desk | 11 May 2016 10:30 PM GMTప్రేమమ్.. మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ. అయితే ఈ సినిమా చూసినవారు.. రొమాంటిక్ ఫీల్ అండ్ లవ్ ను ఎక్కువ ఆస్వాదించుంటారు. కాని ఇప్పుడు తెలుగు వర్షన్ కు సంబంధించి ఈ సినిమాలో ఒక ఫీల్ కట్టయ్యింది. ఈ సినిమాలో ముఖ్యమైన ఆ ఫీల్ ను కట్ చేస్తే ఎలా అంటారా? అబ్బే.. మనోళ్ళు కట్ చేసింది ఈ రొమాంటిక్ ఫీల్ కాదు.. అది ఇంకోటి.
నిజానికి ప్రేమమ్ సినిమాలో మలయాళం వాసన.. క్రిస్టియన్ ఔట్ లుక్ ఎక్కువగా ఉంటుంది. హీరో పేరే జార్జ్. ఇక ఒక హీరోయిన్ పేరు మేరీ.. ఇంకొక హీరోయిన్ మలార్.. ఇంకొక హీరోయిన్ సెలీన్. రెండుసార్లూ క్రిస్టియన్ స్టయిల్ మ్యారేజ్ అండ్ రిసెప్షన్ చూపిస్తాడు. మలార్ తో ఓసారి మాత్రమే టెంపుల్ సీన్ ఉంటుంది. మరి తెలుగుకు లోకలైజ్ చేసినప్పుడు ఇంత పోష్ క్రిస్టియన్ అవుట్ లుక్ మ్యాచ్ అవదు కదా.. అందుకేనేమో దర్శకుడు చందు సినిమా మొత్తానికి తెలుగు పెళ్ళిళ్ళూ.. హీరోయిన్లను నేటివ్ తెలుగు అమ్మాయిలుగా మార్చేశాడు. మొన్న మడోన్నా సెబాస్టియన్ అనే భామతో చైతూ పెళ్లి రిసెప్షన్ ఫోటో అంటూ ఒకటి లీకైంది చూడండి.. అది చూస్తే ఈ విషయం చెప్పొచ్చు.
ఇక మేరీ క్యారక్టర్ ను తెలుగులో కూడా చేస్తున్న అనుపమ పరమేశ్వరన్.. మలయాళంలో జుట్టు విరబూసుకొని కనిపిస్తే.. ఇక్కడ రెండు పిలకలు వేసుకుని తెలుగు పిల్లలా మారిపోయింది. ముఖానికి బొట్టు ఉంది కాబట్టి.. పేరు కూడా మేరీ అని పెట్టు ఉండరని అనుకోవాల్సిందే. ఆ విధంగా.. మల్లూ ఫీల్ ను కట్ చేసి నేటివైజ్ చేశారయ్యా!!