Begin typing your search above and press return to search.

లీక్ చేశారు... కానీ అదే హైప్ క్రియేట్ చేస్తోంది

By:  Tupaki Desk   |   27 Jan 2022 6:43 AM GMT
లీక్ చేశారు... కానీ అదే హైప్ క్రియేట్ చేస్తోంది
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టి్ంచిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాలు రిలీజ్ కు ముందు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేశాయి. కావాల‌నే కొంత మంది ఈ సినిమా కీల‌క ఘ‌ట్టాల‌ని లీక్ చేశారు. అయితే అదే ఈ మూవీకి హైప్ ని క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచేలా చేసింది. స‌రిగ్గా ఇలాంటిదే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో సినిమాకి జ‌రుగుతోందా? అంటే ప్ర‌స్తుంతం జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌ని చూస్తే ప్ర‌తీ ఒక్క‌రికీ ఈ అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. వివ‌రాల్లోకి వెళితే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భారీ క్రేజీ మూవీ `భీమ్లా నాయ‌క్‌`.

జ‌న‌వ‌రి 12న సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం'ఆర్ ఆర్ ఆర్‌','రాధేశ్యామ్‌' చిత్రాల కార‌ణంగా అర్థాంత‌రంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన `భీమ్లా నాయ‌క్‌` తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఈ సారి ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో లీక్ కావ‌డంతో ఈ మూవీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం లీకైంది. దీని పై ప్ర‌స్తుతం హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజాగా లీక్ అయిన క్లిప్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా పోలీస్‌స్టేషన్ లో కీల‌క స‌న్నివేంలో క‌నిపిస్తున్నారు. ఈ సీన్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లు చెబుతున్న తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ సీన్ లో ప‌వ‌న్ చెబుతున్న డైలాగ్ లు సినిమాపై మ‌రింత హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. `వ‌కీల్ సాబ్‌`తో సంతృఫ్తిప‌డిన ఫ్యాన్స్ ప‌వ‌న్ నుంచి అంత‌కు మించి కోరుకున్నారు. అయితే `భీమ్లా నాయ‌క్‌`లో వారు కోరుకున్న అంత‌కు మించి క‌నిపించ‌బోతోంది. తాజాగా లీక్ అయిన వీడియోలో అది స్ప‌ష్టం కావ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ హ్యాపీగా పండ‌గ చేసుకుంటున్నార‌ట‌. బాస్ మ‌ళ్లీ ప‌వ‌ర్ ఫుల్ కంబ్యాక్ ఇవ్వ‌బోతున్నార‌ని సంబ‌రాల్లో మునిగితేలుతున్నార‌ట‌.

మల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా `భీమ్లా నాయ‌క్‌` తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు ఇందులో రానా కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. `గ‌బ్బ‌ర్ సింగ్` త‌రువాత ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా ప‌వ‌న్ క‌నిపించ‌నున్న ఈ చిత్రం కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ సినిమా వుండ‌బోతోంద‌ని తాజాగా లీక్ అయిన వీడియోలో ప్రూవ్‌ కావ‌డంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.

ఈ చిత్రంలో ప‌వ‌న్ బాడీ లాంగ్వేజ్ కూడా కొత్త‌గా వుండ‌టం, త్రివిక్ర‌మ్ అందించిన డైలాగ్ లు ఆయ‌న గ‌త చిత్రాల‌కు పూక్తి బిన్నంగా వుండ‌టం కూడా సినిమాకు మ‌రింత ప్ల‌స్ గా మారింది. రియిలిస్టిక్ పంథాలో సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించిన ఈ చిత్రాన్నిఅత్యంత భారీ బ‌డ్జెట్ తో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత ఎస్ . రాధాకృష్ణ నిర్మించారు. ఇప్ప‌టికే త‌మ‌న్ అందించిన పాట‌లు సినిమాకి మ‌రింత క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `భీమ్లా నాయ‌క్‌` డీజే వెర్ష‌న్ కూడా ఓ రేంజ్ లో పేలింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డ‌మే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం ఖాయం అని మేక‌ర్స్ గ‌ట్టి ప‌న‌మ్మ‌కంతో వున్నారు. తాజాగా లీక్ అయిన వీడియోతో ఆ న‌మ్మ‌కం మ‌రింత పెరిగింది. మ‌ర‌క మంచిదే అన్న‌ట్టుగా ప‌వ‌న్ సినిమాకు లీక్ మంచే చేస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.