Begin typing your search above and press return to search.
SSMB28: అప్పుడే ఏంటీ లీకుల బెడద
By: Tupaki Desk | 19 Jan 2023 3:11 PM GMTమాంత్రికుడితో మహేష్ సినిమా అంటే క్రేజ్ ఉంటుంది. అతడు - ఖలేజా తర్వాత ఈ కలయికలో హ్యాట్రిక్ ప్రయత్నమిది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం #SSMB28 షూటింగ్ ఎలాంటి హంగామా లేకుండా ప్రారంభం కాగా అప్పుడే సెట్ నుంచి లీకులు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సారధి స్టూడియోస్ లో ఒక సెట్ నుంచి లీకులివి. చూడటానికి ఖలేజా లోని పల్లెటూరి సెట్ లా ఈ లీక్ కనిపించింది.
సెట్ వీడియోలను చిత్రీకరించడానికి సారధి స్టూడియోస్ లోకి ప్రవేశం ఎలా? ఈ వీడియోలు ఏ విధంగా బయటికి వచ్చాయి? అన్నది సస్పెన్స్ గా మారింది. నిజానికి మెట్రోకి కూతవేటు దూరంలోనే ఉన్న సారథి స్టూడియోపై మెట్రో రైలులో ప్రయాణీకులు కన్నేసేందుకు ఆస్కారం ఉంది.
పక్కనే ఉన్న అమీర్ పేట్ మెట్రో స్టేషన్ నుండి సెట్ ని చూసేందుకు స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రోలో ప్రయాణించే వారే ఇలా వీడియోలను రికార్డ్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాల్లో లీక్ చేస్తున్నారు.
కానీ ఇది ఇలాగే కొనసాగితే మూవీపై క్యూరియాసిటీ తగ్గుతుంది. ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకు లేకుండా ప్రతిదీ ఓపెనైపోతుంది. ఇది చాలా సమస్యాత్మకం. అందుకే సెట్ నుంచి లీకులు లేకుండా మహేష్- త్రివిక్రమ్ టీమ్ జాగ్రత్త పడుతుందనే అంతా ఆశిస్తున్నారు.
గతంలో పలు చిత్రాల మేకింగ్ వీడియోల్లో మాత్రమే ఆ సెట్ ఎలా ఉంటుందో అభిమానులు చూడగలిగారు... కానీ అంతకుముందే సెట్ వివరాలు రివీల్ కాలేదు. దీనివల్ల క్యూరియాసిటీ పెరిగింది.
గతంలోను పలువురు స్టార్ హీరోల సినిమాల వీడియో క్లిప్ లు నెట్ లో లీకైపోయిన సంఘటనలు తెలిసిందే. కానీ ఎక్కువ లీకులతో క్యూరియాసిటీ తగ్గిపోతుంది.. తస్మాత్ జాగ్రత్త! అంటూ నిర్మాతలను అభిమానులు నేరుగా హెచ్చరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.