Begin typing your search above and press return to search.

కేసు వదలా.. శ్యామ్ కే నాయుడికి నటి సవాల్

By:  Tupaki Desk   |   8 Feb 2022 9:30 AM GMT
కేసు వదలా.. శ్యామ్ కే నాయుడికి నటి సవాల్
X
క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటి అయిన శ్రీసుధతో ఐదేళ్లు సహజీవనం చేసి.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని కెమెరామెన్ శ్యామ్ కే నాయుడి పై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటి శ్రీసుధ తాజాగా సంచలన ప్రకటన చేసింది. తనకు శ్యామ్ తో ప్రాణహాని ఉందనే భయంతో శ్రీసుధ అతడికి బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది.

ఈ విషయంపై నటి సుధ ఫేస్ బుక్ వేదికగా స్పందించింది. ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానంటూ సంచలన పోస్ట్ చేసింది. ఈ కేసును వదిలిపెట్టేది లేదని శ్రీసుధ స్పష్టం చేసింది.

2012 నుంచి శ్యామ్ కే నాయుడు-శ్రీసుధ మధ్య అనుబంధం ఉంది. వీరిద్దరూ 5 ఏళ్లు సహజీవనం చేశారని శ్రీసుధ అంటోంది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని గతంలో ఆమె పలు ఇంటర్వ్యూల్లో పేర్కొంది. శ్యామ్ వల్లే అప్పుల పాలయ్యానని ఆమె వాపోయారు.

దాదాపు మూడేళ్లుగా వీరిద్దరిపై కేసు నడుస్తోంది. డబ్బు ఆశ చూపి తెగదెంపులు చేసే ప్రయత్నం కూడా చేశాడని.. శ్యామ్ కే నాయుడు భార్య రెండు సార్లు తనపై దాడి చేశారని సుధ గతంలో ఆరోపించారు.

-కేసు ఇదీ..
సినీ నటి శ్రీసుధను వేధించిన కేసులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుకి గతంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్యామ్ కే నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో శ్రీసుధ కేసు వేసింది.నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని శ్యామ్ కే నాయుడును సుప్రీంకోర్టు ఆదేశించింది.

పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని.. శ్యామ్ కే నాయుడుపై గతంలో సినీ నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంప్రమైజ్ అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు , చెక్కులు, డీడీలు రూపంలో 50 లక్షలు ఇచ్చినట్లు శ్యామ్ కే నాయుడు కోర్టుకు సమర్పించారు. డాక్యుమెంట్లు చూసి శ్యామ్ కే నాయుడుకు నాంపల్లి సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే బెయిల్ రద్దు చేయాలంటూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శ్రీసుధ కేసు వేసింది. సుప్రీంలో తనను చంపేందుకు కుట్ర చేశారని.. విజయవాడలో కారు యాక్సిడెంట్ చేశారంటూ కోర్టుకు శ్రీసుధ తెలిపింది.ఈ కేసులో శ్యామ్ కే నాయుడుతోపాటు ఆయన సోదరుడు చోటా కే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు శ్రీసుధ ఆరోపిస్తోంది. అయితే ఈమె పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో కేసు వదిలిపెట్టను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.