Begin typing your search above and press return to search.

చిక్కుల్లో అనుష్క.. లీగల్ నోటీసులు జారీ

By:  Tupaki Desk   |   21 May 2020 4:45 AM GMT
చిక్కుల్లో అనుష్క.. లీగల్ నోటీసులు జారీ
X
బాలీవుడ్ లో ఇటీవల వచ్చిన అమెజానా ప్రైమ్ లో ప్రసారమైన ‘పాతాల్ లోక్’ షో వివాదంలో చిక్కుకుంది. ఈ షోకు కో ప్రొడ్యూసర్ గా కూడా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వ్యవహరించింది. ఆ సినిమా మే 18న టెలికాస్ట్ అయ్యింది.

ఈ షో రెండో ఎపిసోడ్ లో నేపాలి కమ్యూనిటీ మొత్తాన్ని అవమానించేలా పలికిన ఓ డైలాగ్ వివాదాస్పదమైంది. నేపాలీ క్యారెక్టర్ ను కమ్యూనిటీని మొత్తాన్ని కించపరిచేలా ఓ పదం వాడారు. అందులో తప్పేం లేకపోయినా అక్కడ నేపాలీ అనే పదాన్ని కూడా కలుపడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి.

ఈ షోకు అనుష్క శర్మ కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో ఆమెకు నోటీసులు పంపారు. ఈ వ్యవహారంపై అనుష్క స్పందించలేదు. గోర్ఖా కమ్యూనిటీ అనుష్యపై లీగల్ విచారణకు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ పాతాల్ లోక్ లో ఆ పదాన్ని తొలగించాలని నోటీసుల్లో గోర్ఖా కమ్యూనిటీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు భారత బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖకు కూడా ఆన్ లైన్ లో పిటీషన్ దాఖలు చేసింది.