Begin typing your search above and press return to search.
హలో.. నెంబర్ వాడేముందు చూస్కోరా?
By: Tupaki Desk | 24 Jan 2018 8:22 AM GMTఅప్పట్లో నాగార్జున 'శివమణి' అనే సినిమాతో వచ్చాడు. అందులో టైటిల్ క్రింద 9848022338 అంటూ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేశారు. న్యాచురల్ గానే ఇలాంటి ఫీట్లను చేస్తే.. ఆ నెంబర్ నిజంగానే సదరు సినిమాకు చెందినవారిదేమో అంటూ కొంతమంది సినీప్రియులు కాల్స్ చేసే ఛాన్సుంది. కాని అది విజయనగరంకు చెందిన ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విషయం అప్పట్లో పెద్దగా రచ్చవ్వలేదు కాని.. ఇప్పుడు మాత్రం నాగార్జునకు చుక్కెదరవుతోంది.
హాలో సినిమా అంతా కూడా.. చిన్నప్పుడు హీరోయిన్ ఆ పిల్లాడికి ఇచ్చిన ఫోన్ నెంబర్ చుట్టూతానే తిరుగుతుంది. అయితే సినిమాల్లో మనోళ్ళు ఈ మధ్యన ఫోన్ నెంబర్లను పూర్తి సంఖ్య ఎక్కడా చెప్పట్లేదు కాని.. హలో సినిమాలో మాత్రం 100 రూపాయల నోటుపై పూర్తిగా రాసేసి చూపించారు. ఇప్పుడు ఆ నెంబర్ కు మేము హీరోయిన్ కళ్యాణి ఫ్యాన్స్ అంటూ రోజూ కాల్స్ చేస్తున్నారంట మన తెలుగు జనాలు. ఇంతకీ ఆ నెంబర్ ఎవరిదో తెలుసా? జార్ఖండ్ కు చెందిన వికాస్ ప్రజాపతికి చెందిన నెంబర్ అది. వీరు చేసే కాల్స్ కారణంగా అతను రోజూ మానసికంగా క్షోభ అనుభవిస్తున్నాడట. ఆఫీసులోనూ ఇంట్లోనూ ప్రశాంతత కోల్పోయానంటూ.. నాకు 50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని ఇప్పుడు హలో ప్రొడ్యూసర్ నాగార్జునపై కోర్టులో కేసు వేశాడు.
ఇదే విషయం అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలను అడిగితే.. అబ్బే మేం టెలికాం ఆపరేటర్ పర్మిషన్ తీసుకున్నాం అంటున్నారు. కాని సదరు టెలికాం ఆపరేటర్ మాత్రం.. అసలు మేం ఎవ్వరికీ అలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు అని చెబుతున్నారు. అసలు ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ వాడేటప్పుడు.. ఆ వ్యక్తి పర్మిషన్ అడగాలి కాని.. అలా టెలికాం ఆపరేటర్ పర్మిషన్ అడుగుతారా నాగ్ సార్? అయినా ఒక ఫోన్ నెంబర్ వాడాలంటే.. ఐదు రూపాయలకు సిమ్ దొరుకుతున్న ఈ రోజుల్లో కొత్త నెంబర్ కొనుక్కొని వాడేసి పక్కన పడేయొచ్చు కదా? ఎందుకిలా ఇతరులను ఇబ్బంది పెట్టడం?