Begin typing your search above and press return to search.

రెండుళ్లుగా ఆ సినిమాను అడ్డుకుంటున్న ప్రకాష్ రాజ్

By:  Tupaki Desk   |   6 Feb 2019 11:03 AM GMT
రెండుళ్లుగా ఆ సినిమాను అడ్డుకుంటున్న ప్రకాష్ రాజ్
X
టాలీవుడ్‌, కోలీవుడ్‌ లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రకాష్‌ రాజ్‌ విలక్షణ నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. రాజకీయంగా కూడా మెల్ల మెల్లగా అడుగులు వేస్తోన్న ప్రకాష్‌ రాజ్‌ త్వరలో జరుగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సినీ కెరీర్‌ లో ప్రకాష్‌ రాజ్‌ దూసుకు వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయనకు ముంబయి హై కోర్టు లీగల్‌ నోటీసులు పంపడం చర్చనీయాంశం అయ్యింది. జీ స్టూడియోస్‌ ఇటీవల ప్రకాష్‌ రాజ్‌ కు వ్యతిరేకంగా ముంబయి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ప్రకాష్‌ రాజ్‌ కొన్నాళ్ల క్రితం నటించి దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ' చిత్రంను హిందీలో 'తడ్కా' పేరుతో రీమేక్‌ చేశారు. ఈ రీమేక్‌ ను జీ స్టూడియోస్‌ తో కలిసి జితేష్‌ వర్మ నిర్మించాడు. జితేష్‌ వర్మ నటుడు ప్రకాష్‌ రాజ్‌ బంధువు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ స్టూడియోస్‌ సంస్థ 60 శాతం వాటా మరియు జితేష్‌ వర్మ 40 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే ప్రకాష్‌ రాజ్‌ వాటా గురించి మొదట ఎలాంటి చర్చలు జరగలేదు. జితేష్‌ వర్మ వాటాలోంచి ప్రకాష్‌ రాజ్‌ వాట అనుకున్నారట. ఈ విషయాన్ని జీ స్టూడియోస్‌ చెబుతుంది. కాని ప్రకాష్‌ రాజ్‌ మాత్రం సినిమాను అడ్డుకుంటున్నాడు.

2017వ సంవత్సరంలో విడుదలవ్వాల్సి 'తడ్కా' చిత్రం ఇదే వివాదం కారణంగా వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా ముంబయి హైకోర్టుకు జీ స్టూడియోస్‌ వెళ్లడంతో ప్రకాష్‌ రాజ్‌ కు కోర్టు లీగల్‌ నోటీసులు పంపించడం జరిగింది. లీగల్‌ నోటీసులకు స్పందించేందుకు కోర్టు కొంత సమయంను ఇచ్చింది. ఆ సమయం లోపు స్పందించాల్సి ఉంటుంది. మరి ప్రకాష్‌ రాజ్‌ తడ్కా విషయంలో తన వాదనలను ఎలా వినిపిస్తాడో చూడాలి.