Begin typing your search above and press return to search.

లెజెండ్ శ‌ర‌వ‌ణన్‌ ఒక్క‌టితో ఆగ‌డంట‌!

By:  Tupaki Desk   |   25 Feb 2023 7:00 AM GMT
లెజెండ్ శ‌ర‌వ‌ణన్‌ ఒక్క‌టితో ఆగ‌డంట‌!
X
గ‌త ఏడాది యాబై ఏళ్లు నిండిన ఓ వ్య‌క్తి హీరోగా ఎంట్రీ ఇచ్చేసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురి చేశాడు. ఆయ‌నే లెజెండ్ శ‌ర‌వ‌ణ స్టోర్స్ అధినేత అరుళ్ శ‌ర‌వ‌ణ‌న్. ఐదు ప‌దుల వ‌య‌సులో క‌థానాయకుడిగా న‌టించిన మూవీ `ది లెజెండ్‌`. జేడీ జెర్రీ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందించాడు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీ గ‌త ఏడాది జూలైలో తమిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌లై హాట్ టాపిక్ గా మారింది.

ఐదు ప‌దులు దిటిన శ‌ర‌వ‌ణ‌న్ ఇద్ద‌రు హీరోయిన్ లు గీతాకా తివారీ, ఊర్వ‌శీ రౌతేలాతో క‌లిసి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీ విడుద‌ల స‌మ‌యంలో చాలా మంది శ‌ర‌వ‌ణ‌న్ ట్రోల్ చేశారు కూడా. డ‌బ్బుంటే ఏదైనా చేయోచ్చ‌ని కొంత మంది అనుకుంటార‌ని, అలాగ‌ని సినిమా హీరోలు కాలేర‌ని సోష‌ల్ మీడియాలోశ‌ర‌వ‌ణ‌ని ట్రోల్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్ ల‌ని, డైలాగ్ ల‌కు సంబంధించిన వీడియోల‌ని మీమ్స్ గా వాడుతూ నెట్టింట వైర‌ల్ చేశారు.

అయినా శ‌ర‌వ‌ణ వీటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తాను హీరో కావాల‌ని అనుకున్నాడు అయ్యాడు. దీంతో ఇక త‌న కోరిక తీరింద‌ని అంతా అనుకున్నారు. ఇక సినిమాల్లో క‌నిపించ‌డ‌ని భావించారు. కానీ చెన్నై లెజెండ్ స్టోర్స్ శ‌ర‌వ‌ణ‌న్ ఒక్క సినిమాతో ఆగ‌డంట మ‌రో సినిమా కూడా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా శుక్ర‌వారం వెల్ల‌డించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా తాను మంచు ప‌ర్వ‌త ప్రాంతంలో వున్న ప‌లు ఫొటోల‌ని షేర్ చేశారు.

సోష‌ల్ మీడియావేదిక‌గా మంచు ప‌ర్వ‌త ప్రాంతంలో స్టైల్ గా ఫొటోల‌కు పోజులిచ్చిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్ ఈ ఫొటోల‌కు ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ని జోడించారు. `నిరీక్ష‌ణ స‌మీపిస్తోంది. కొన్ని రోజుల్లో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ లు రానున్నాయి` అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజ‌న్ లు ఇంకేముందీ మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమాతోదండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నార‌న్న‌మాట అంటూ కామెంట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. శ‌ర‌వ‌ణ‌న్ మ‌రి ఈ సారి ఎలాంటి సినిమాతోప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.